Kriti Shetty: సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అందంగా కనిపించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడమే కాకుండా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని రూపం కూడా మార్చుకుంటున్నారు. ఇప్పాటికే ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు తమ శరీరంలో బాగ లేని అవయవానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.
ఇక తాజాగా అందాల సుందరి కృతి శెట్టి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వార్తలపై కృతి శెట్టి తాజాగా స్పందించింది.
ఈ క్రమంలో ” ఇలాంటి వార్తలు ఎవరు రాస్తారో ఎందుకు రాస్తారో అర్థం కావడం లేదు. ఇలాంటి వార్తల వల్ల ఎంతో బాధ కలుగుతుంది . మా కుటుంబాలు కూడా ఎంతో బాధపడతాయి అని తెలిపింది.
ఉప్పెన సినిమాలో ఉన్నట్లు ఇప్పుడు లేనని అంటున్నారు. కానీ మనిషి శరీరంలో మార్పులు వస్తుంటాయి. అందరిలాగా సినిమాలలో మేకప్ హెయిర్ స్టైల్ వల్ల నా ముఖంలో కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానికే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని వార్తలు రాయటం సరైన పద్దతి కాదు” అంటూ బెబామ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల కృతి శెట్టి నటించిన కస్టడీ సినిమా కూడా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఉప్పెన సినిమా తర్వాత కృతి నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఇక ఇటీవల కస్టడీ సినిమాలో నాగచైతన్య సరసన నటించింది. అయితే ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఇలా కృతి శెట్టి నటించిన 4 సినిమాలు వరుసగా ప్లాప్ అవటంతో ఇంతకాలం లక్కీ హీరోయిన్గా గుర్తింపు పొందిన కృతి శెట్టి ని ప్రస్తుతం ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…