దేవుళ్ళు లేదా దేవతలకు గుడి కట్టడం సర్వ సాధారణం. తర్వాత రాజులు, చక్రవర్తులకు గుడి కట్టిన దాఖలాలున్నాయి. ఆ తర్వాత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులకు గుడి కట్టిన సందర్భాలున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులకు ఆ పార్టీ కార్యకర్తలు గుడి కట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగే తారలకు గుడి కట్టడం జరిగిన మొట్ట మొదటి తార ఖుష్బూ.. అందమైన రూపం కుర్రాళ్ల మతులు పోగొట్టే వయ్యారం ఆమె సొంతం. 80-90 దశకంలో స్టార్ హీరోయిన్ గా సౌత్ సినిమాలలో ఒక వెలుగు వెలిగారు కుష్బూ. మహారాష్ట్రకు చెందిన కుష్బూ కోలీవుడ్ తిరుగులేని నటిగా ఎదిగారు.. ఆమె అందానికి పడిపోయిన తమిళ ప్రేక్షకులు గుడికూడా కట్టి ఆరాధించారంటే అర్థం చేసుకోవచ్చు.
1970 ముంబైలో పుట్టిన ఖుష్బూ బాల్యంలోనే అనేక చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ లో హీరో వెంకటేష్ న్యూ ఎంట్రీ తో వచ్చిన కలియుగ పాండవులు చిత్రంలో హీరోయిన్ గా ఖుష్బూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు ఘటనను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఖుష్బూ. సినీ పరిశ్రమలో లైగింక వేధింపుల గురించి మాట్లాడుతూ.. ఒక సమయంలో తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు ఖుష్బూ. తెలుగులో తన మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’ చిత్రం షూటింగ్ జరుగుతున్నా సమయంలో తనతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది.
ఒక విలేజ్ లో కలియుగ పాండవులు సినిమా షూటింగ్ ముగిసిన తరువాత మేడపైకి మెట్లు ఎక్కుతున్న సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన వెనుక భాగంపై తాకాడని.. వెంటనే కోపంతో తాను అతని చెంప పగలగొట్టానని నటి ఖుష్బూ. అయితే ఆ సమయంలో ఆ చిత్ర నిర్మాత డి. సురేష్ బాబు అక్కడే ఉన్నారని.. అప్పుడు ఆయనతో పాటు అక్కడ షూటింగ్ లో ఉన్న కొందరు తనకు మద్దతుగా నిలిచారు.. అంటూ కుష్బూ తన డెబ్యూ మూవీ షూటింగ్ లో జరిగిన చేదు అనుభవం గురించి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…