L.B. Sriram : కమెడియన్ గా అందరికీ బాగా తెలిసిన ఎల్బి శ్రీరామ్ గారు మంచి హాస్యానటుడే కాదు గొప్ప రైటర్ కూడా. ఆయన డైలాగు రైటర్ గా సినిమాలకు పనిచేసారు. విభిన్నమైన డైలాగు డెలివరీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బ్యానర్ మీద షార్ట్ ఫిలిమ్స్ ను తీస్తున్నారు. సినిమాల్లో ఇస్తున్న మూస పాత్రలను చేయడం ఇష్టం లేక వాటి నుండి తప్పుకున్నాను అంటూ శ్రీరామ్ చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడిన ఎల్బి శ్రీరామ్ గారు ప్రస్తుతం కవి సామ్రాట్ అనే షార్ట్ ఫిల్మ్ ను ఆహా ఒరిజినల్స్ లో చేశారు. ఇక మూస పాత్రలతో ఇమడలేక చాలా సినిమాలను వదులుకున్న ఆయన ప్రస్తుతం ఆయన రచయితగా ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యువతకు మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు.
శీనువైట్ల ని అడగాలని అనుకుంటున్నా…
డైరెక్టర్ సాగర్ దగ్గగర పనిచేసిన ఎల్బి శ్రీరామ్ గారు కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించారు. అదే సాగర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వినాయక్, శీను వైట్ల సినిమాలో ఎల్బి శ్రీరామ్ గారు పనిచేయలేదు. ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ వినాయక్ దగ్గర ‘ఆది’ సినిమాకు పనిచేసాను కానీ శీను వైట్ల తీసేవి కామెడీ ఆధారిత చిత్రాలే అయినా ఎందుకో ఆయన నన్ను పెట్టుకోలేదు, కారణలు ఏమీ లేవు అంటూ చెప్పారు. ఇక హిట్లర్ సినిమాకు రచయితగా పనిచేసిన ఎల్బి శ్రీరామ్ గారు ఆ సినిమాకు మొదట మరుధురి రాజా రచయితగా ఉన్నా ఆ తరువాత ఆయన్ను తొలగించి శ్రీరామ్ గారిని పెట్టుకోవడం గురించి చెప్పారు.
అంతకుముందు చిరంజీవి సినిమాలు కొంత నిరాశ పరచడంతో ‘హిట్లర్’ సినిమాతో హిట్ కొట్టాలని ఖచ్చితంగా అనుకున్న చిరు కొత్తదనం అన్ని డిపార్ట్మెంటుల్లోనూ ఉండాలని అనుకున్నారు. అలా మొదట అనుకున్న టీంను ప్రక్షాళన చేసి డిస్కషన్ లో నా పేరు వచ్చి నన్ను రచయితగా తీసుకున్నారు. నన్ను ఎవరు ఆ సినిమాకు సిఫార్సు చేసారో కూడా తెలియదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…