Poojitha-Lakshmi Parvati: అలా చేసినందుకు బాంబులు వేసి లేపేస్తాం… యాసిడ్ పోస్తామని హెచ్చరించారు: నటి పూజిత
Poojitha-Lakshmi Parvati: అలనాటి నటి పూజిత మళ్లీ తెరపై యాక్టివ్ కాబోతున్నారు. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ వంటి ఎవర్ గ్రీన్ కామెడీ సినిమాలో పాటు 138కి పైగా సినిమాలు నటించిన పూజిత చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజగా మరోసారి ఆమె వెండితెరపై మెరవబోతున్నారు. వరసగా రెండు సినిమాలకు సైన్ చేశారు. అయితే తన కెరీర్లో జరిగిన ఓ విషయంపై ఆమె స్పందించారు.
లక్ష్మీ పార్వతితో తనకున్న విభేదాలను బయటపెట్టారు. అప్పట్లో ’అమ్మో అల్లుడా.‘ అనే సినిమా వచ్చిందని పూర్తిగా పొలిటికల్ సినిమా అని చెప్పింది. దీంట్లో నేను లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ చేశానని చెప్పుకొచ్చింది పూజిత. కోనేరు రవీంద్ర ఆ చిత్రానికి నిర్మాత. ఆ సినిమాలో నా క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పి.. సినిమాలో నన్ను పెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ కూడా ఉంటుందని ఆయనకు భార్యగా లక్ష్మీ పార్వతి పాత్రలో నటించాలని చెప్పారు. అయితే ఆమె పేరును ఎక్కడా కూడా వాడలేదని తెలిపారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఉండగానే ఎన్టీఆర్ గారు చనిపోయారని చెప్పింది.
ఎన్టీఆర్ చనిపోయినప్పడు.. ఆయన ఇంటికి వెళ్లానని.. స్టేడియంకి కూడా వెళ్లానని చెప్పింది. అయితే ఆ సందర్భంలో లక్ష్మీ పార్వతి చేసిన కొన్ని విషయాలను… నేను సినిమాలో అలాగే చేశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ సన్నివేశాలు లక్ష్మీ పార్వతికి బలంగా తాకినట్లు చెప్పింది.
ఎన్టీఆర్ చనిపోయిన సందర్భంలో కాఫీ తాగుతున్న లక్ష్మీ పార్వతి.. పీవీ నరసింహరావు రాగానే తాగే కప్పును పక్కన పెట్టి ఏడ్వడం స్టార్ట్ చేసిందని… చెప్పింది పూజిత. అయితే ఆ సన్నివేశం నామదిలో అలాగే ఉందని తెలిపింది. ఎవరైనా వస్తే ఉన్నపళంగా బాగా ఏడవాలన్నమాట అని అర్థమైంది. ఈ సన్నివేశాన్ని సినిమాలో యదాతథంగా నేను చేశాను. ఈసీన్ చూసి లక్ష్మీ పార్వతి నున్ను బాంబులతో లేపేస్తా.. యాసిడ్ పోయిస్తా.. అని చెప్పి అప్పట్లో నాపై కేసు పెట్టారు. అయితే దాన్ని చిత్ర నిర్మాత, డైరెక్టర్ చూసుకున్నారన్నారు. నేను ఓ నటిని.. డైరెక్టర్, నిర్మాతలు చెప్పినట్లు నటించడం మాత్రమే నాపని అని చెప్పుకొచ్చింది పూజిత. కేసులతో నాకేంటి సంబంధం అని అంది. అయితే ఆ తరువాత లక్ష్మీ పార్వతిని రెండు మూడు సార్లు కలిశాను ఆమె సరిగ్గా మాట్లాడలేదని చెప్పింది పూజిత.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…