కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో అరుదైన గౌరవంగా భావించే ‘కర్ణాటక రత్న’ అవార్డును మరణం తర్వాత అతడికి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు.
పునీత్‌కు వందనం పేరుతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. చాలామందితో సమాలోచనలు చేసిన తరువాత పునీత్‌కు కర్ణాటక అత్యున్నత పురస్కారమైన ‘కర్ణాటక రత్న’ను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అతడు కన్నడ ప్రజలకు కాదు దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. అతడు తనకు ఇష్టమైన నటుడు అని.. పునీత్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అని సీఎం అన్నారు. కర్ణాటక నుంచి బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక బాలుడు పునీత్ అంటూ గుర్తు చేశాడు. తన చిన్నతనం నుంచే అద్భుతంగా నటించేవాడని కితాబిచ్చాడు.
ఇంత చిన్న వయసులో అలా నటించడం అంత సులువు కాదు అంటూ.. అన్నాడు సీఎం. భారతదేశంలో అత్యూన్నత పురస్కారం భారత రత్న. కానీ .. కార్ణటకలో మాత్రం రాష్ట్రం పరంగా అత్యన్నతమైనది కర్టాటక రత్న. వివిధ సేవలకు గుర్తింపులకు గాను ఈ అవార్డును ప్రకటిస్తారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…