Amardeep: అమర్ దీప్ బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా అమర్ రన్నర్ గా నిలిచి బయటకు వచ్చారు అయితే ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు ఈయన కారు పై దాడి చేసిన ఘటన మనకు తెలిసిందే.
ఇక ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది ఇక బిగ్ బాస్ తర్వాత అమర్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఈయనను తన భార్య తేజస్వినిని మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ సీరియల్ నటి శోభా శెట్టి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ విశేషాలు గురించి కూడా మాట్లాడారు.
తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన చిన్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా కారుపై దాడి జరిగిన తర్వాత కారు రిపేరు గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారని తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ అభిమానులు కారుపై దాడి చేసిన తర్వాత రిపేరు కోసం ఎంత మొత్తంలో ఖర్చయింది అంటూ శోభ శెట్టి ప్రశ్నించారు.
నాలుగు లక్షలు ఖర్చు..
ఈ ప్రశ్నకు అమర్ సమాధానం చెబుతూ తనకు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చయింది అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహం కారణంగా ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పెద్ద ఎత్తున రాళ్లతో కారుపై దాడి చేయగా అద్దాలని పగిలిపోయి ఆ రాళ్లు కారు లోపల ఉన్నటువంటి అమర్ అలాగే తన తల్లి భార్యలకు కూడా తగలాయి అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…