Rajasaab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన హీరోగా ఇటీవల సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ప్రభాస్ కల్కి సినిమాతో పాటు స్పిరిట్ రాజా సాబ్ సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. రాజా సాబ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాకు మారుతి దర్శకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు ముందుగా హీరో ప్రభాస్ కాదట వేరే హీరో రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ ఈ సినిమాలో భాగమయ్యారని తెలుస్తుంది. ఈ సినిమా కథ రాసేటప్పుడు మారుతి హీరో నానిని ఊహించుకొని కథ రాశారట నాని వద్దకు ఈ సినిమా కథతో వెళ్లగా కొన్ని కారణాలవల్ల ఆయన రిజెక్ట్ చేశారు.
నాని చేయాల్సి ఉండేదా..
ఈ విధంగా మారుతి రిజెక్ట్ చేసిన అనంతరం మరికొంతమంది హీరోల వద్దకు వెళ్ళగా ఎవరు కూడా ఈ సినిమాకు కమిట్ కాకపోవడంతో మారుతి మరోసారి ఈ సినిమా కథ మొత్తం పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ రాసారట. ఇలా స్క్రిప్ట్ మార్చిన తర్వాత ప్రభాస్ వద్దకు వెళ్లగా ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారని తెలుస్తుంది ఇలా ఈ సినిమాకు ముందుగా నాని ఆప్షన్ అని నాని కాదనడంతో ప్రభాస్ చేస్తున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…