Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది.
తాజాగా లావణ్య త్రిపాఠి అనాధ పిల్లలకు సహాయం చేసి మంచి మనసు చాటుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ సంపాదించిన దానిలో కొంత భాగం చారిటబుల్ ట్రస్ట్ కి దానం చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే లావణ్య త్రిపాఠి కూడా తాను సంపాదించిన దానిలో కొంతవరకు సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తూ తన మంచి మనసు చాటుకుంటుంది.
తాజాగా హైదరాబాద్ లోనే ఒక అనాధ ఆశ్రమంకి వెళ్లిన లావణ్య త్రిపాఠి అక్కడి విద్యార్థులతో సరదాగా గడిపింది. విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేసింది లావణ్య.
ఆ తర్వాత అనాధలైన విద్యార్థులకు తన వంతు సహాయం చేసి, ఆ తర్వాత విద్యార్థులకు భోజనం వడ్డించి తాను కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలు వైరల్ కావడంతో కొంతమంది అభిమానులు లావణ్య మంచి మనసు గురించి గొప్పగా చెబుతూ ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే అందాల రాక్షసి, భలే భలే మగాడివోయ్ సినిమాల తర్వాత ఈ అమ్మడికి సరైన హిట్ లభించలేదు. అయినప్పటికీ హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలలో, వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…