Lawyer Sivaprasad Reddy : ఏపీ రాజకీయం అంతా మూడు రాజధానులు మూడు పెళ్లిళ్లు అంటూ సాగుతోంది. వైసీపీ పాలనలో మూడు రాజధానుల గురించి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుంటే జగన్ సర్కార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ గురించి స్పందిస్తూ పరుశంగా మాట్లాడారు. ఇక మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరికీ అన్యాయం చేయలేదు అంటూ చెప్పాడు. ఈ అంశం మీద ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడిన తీరును తప్పుబట్టారు, నోటీసులు ఇచ్చారు. నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో లీగల్ గా సమస్యలను ఎదుర్కొంటారా అనే అంశం మీద హైకోర్ట్ లాయర్ శివప్రసాద్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు.
ఆ ముగ్గురు భార్యలు నీకోచ్చి కంప్లైన్ట్ చేసారా…
చట్టభద్ధంగా విడిపోయి మరో పెళ్లి చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ లీగల్ గా ఇబ్బందులు ఉండవు అంటూ శివప్రసాద్ తెలిపారు. ఇక విడిపోయిన మొదటి ఇద్దరు భార్యల్లో ఎవరైనా వారికి అన్యాయం జరుగుంటే కోర్ట్ ను కానీ పోలీసులను కానీ ఆశ్రయించి పవన్ కళ్యాణ్ మీద కేసు వేయొచ్చు. వాళ్లెవరూ బయటికి రానప్పుడు వీళ్ళేందుకు నోటీసులు ఇచ్చారు, అన్యాయం చేసావ్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు కొంతమంది అభ్యంతరకరంగా ఉన్నా మహిళలను కించపరిచేలా మాత్రం లేవు.
ఈ విషయం మీద మహిళా కమిషన్ నోటీసులు పంపినా పవన్ కళ్యాణ్ కి లీగల్ గా ఏం జరగదంటూ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఏదైనా లీగల్ గా జరగాలంటే అది ఆయన నుండి విడాకులు తీసుకున్న వారు అన్యాయం జరిగిందని కేసు వేస్తేనే జరుగుతుంది. అయినా రాష్ట్రంలో ఇంకేం ఇష్యూస్ లేవన్నట్టు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడటం బాగోలేదంటూ శివప్రసాద్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…