Featured

Singer KK: గుండెపోటుతో ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం.. సంతాపం తెలిపిన మోడీ!

Singer KK: పాటే తన ప్రాణంగా భావించిన ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.తీయటి గాత్రంతో పలు భాషలలో ఎన్నో అద్భుతమైన పాటలను పాడి విశేష ఆదరణ సంపాదించుకున్న కృష్ణ కుమార్ కున్నాత్ తన చివరి శ్వాస వరకు పాటపాడుతూ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృత్యువాతపడ్డారు.

Singer KK: గుండెపోటుతో ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం.. సంతాపం తెలిపిన మోడీ!

మంగళవారం రాత్రి కోల్‌కతాలోని నజ్రుల్ మంచా వివేకానంద కళాశాల ఫెస్ట్‌లో పాటల వాడిన అనంతరం కేకే ది గ్రాండ్ హోటల్ కి చేరుకొని ఆ సంగీత వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో హోటల్ గదిలో కుప్పకూలిపోయారు.

Singer KK: గుండెపోటుతో ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం.. సంతాపం తెలిపిన మోడీ!

ఇతనిని గమనించిన అతని సహాయకులు కార్యక్రమ నిర్వాహకులు ఇతనిని హుటాహుటిన కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృత్యువాతపడ్డారు.
కేకే ఆగస్టు 23, 1968 న ఢిల్లీలో మలయాళీ దంపతులైన సి. ఎస్. నాయర్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించిన కేకే సంగీతంపై మక్కువతో గాయకుడిగా పలు భాషలలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు.

చివరి శ్వాసవరకు పాట పాడుతూ…

ఇలా పాటే ప్రాణంగా బతికిన కేకే తన తుది శ్వాస వరకు పాటలు పాడుతూ తుది శ్వాస విడవడంతో ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం కేకే మరణ వార్త విని సంతాపం ప్రకటించారు. కేకే తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి విశేష ప్రేక్షకాదరణ పొందారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago