Radhika Apte : రాధికా ఆప్టే చేసింది కొన్ని సినిమాలే అయిన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర, బాలకృష్ణ లెజెండ్ సినిమాలో నటించింది. ఇక తమిళంలో రజనీకాంత్ సినిమాలో నటించింది. ఇక తనకు నచ్చినట్టు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీపై బోల్డ్ కామెంట్స్ చేయటం రాధికా ప్రత్యేకత. బాలీవుడ్ లోనూ బెంగాలీ లోనూ నచ్చిన పాత్రలనే చేస్తూ ప్రత్యేక గుర్తింపుతో దూసుకెళుతోంది.
సర్జరీ ముఖాలను చూడలేక పోతున్నా…..
రాధికా ఆప్టే ప్రస్తుతం సినిమాలను తగ్గించి ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. తాను రీసెంట్ గా చేస్తున్న హిందీ సినిమా విక్రమ్ వేదాలో నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పోలీస్ పాత్రలో, హృతిక్ రోషన్ రౌడీ పాత్రలో నటిస్తున్నారు. తమిళ సినిమా విక్రమ్ వేద సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో రాధిక ఒక కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా రాధికా చేసినా బోల్డ్ కామెంట్స్ తో మరోసారి వైరల్ అయింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్లను సర్జరీ ముఖాలతో చూడలేకపోతున్నా అని ఘాటు వాఖ్యలు చేసింది.
వారి అందం కోసం ముఖానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటే భరించలేకపోతున్నా, బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడే వారే ఇలా చేయడం మరీ విడ్డురంగా ఉండి అంటూ కామెంట్స్ చేసింది. వయసుతో పోటీపడలేక శరీరంతో పోరాడుతున్నారని చెప్పింది. ఇక తనకు రాజీ పడటం ఏ విషయంలోనూ ఇష్టం లేదని చెప్పింది. ఇక రాధికకు ఇలాంటి వాఖ్యలు కొత్తేం కాదు ఇంతకు ముందు కూడా దక్షిణాది సినిమా పరిశ్రమలో హీరోలగురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇక ఈ అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. ఇక ఇపుడు హీరోయిన్ల గురించి చేసిన వాఖ్యల గురించి ఆ హీరోయిన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…