Featured

Divyavani: వాళ్లు శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లడిగే రకం.. సీనియర్ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు?

Divyavani:తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి దివ్య వాని ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. కళాకారుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఈమె ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. 2019లో టిడిపి తీర్థం పుచ్చుకున్న దివ్యవాణి పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడ్డారు.

Divyavani: వాళ్లు శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లడిగే రకం.. సీనియర్ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు?

ఈ క్రమంలోనే పార్టీకార్యక్రమాలలోనూ ఎంతో యాక్టివ్గా ఉండే ఈమె తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు. దివ్యవాణి టిడిపి పార్టీలో ఉన్నప్పటికీ తాను ఎంతో క్షోభ అనుభవించానని, రాజీనామాకు ముందే ఆమె పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Divyavani: వాళ్లు శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లడిగే రకం.. సీనియర్ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు?

తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన తర్వాత పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను పార్టీలో మీకు సరైన న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నలు వేసినప్పుడు లోలోపల ఎంతో బాధను అనుభవిస్తూ తనని తాను కంట్రోల్ చేసుకున్నానని ఈ సందర్భంగా దివ్యవాణి తెలిపారు. ఎలాంటి అధికారం లేని తనకు అధికార ప్రతినిధి అనే పేరు ఇచ్చారని ఈమె తెలిపారు.

మాట్లాడే అవకాశం ఇవ్వలేదు…

పార్టీ కోసం ఎంతో కష్టపడిన పార్టీలో సరైన గుర్తింపు లేదని పార్టీలో సరైన గైడెన్స్ ఇచ్చే వారు లేరని ఈమె వెల్లడించారు.ఎంతో కష్టపడి ఆరోగ్యం బాగా లేకపోయినా ఇంట్లో పిల్లల్ని వదిలేసి హుటాహుటిన మహానాడు కార్యక్రమానికి వచ్చానని, అయితే మహానాడు కార్యక్రమంలో తనకు కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదని వాపోయారు. ఇంటికి వెళ్లి ఎంతో బాధతో ఏడ్చానని ఆ సమయంలో తన పిల్లలు తనని తిట్టారని ఈమె వెల్లడించారు. బహుశా దారిలో నాకు ఏదైనా ప్రమాదం జరిగితే నా శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడిగే రకం అంటూ తెలుగుదేశం పార్టీపై ఈమె అసహనం వ్యక్తం చేశారు.ఇలా తెలుగుదేశం పార్టీ గురించి దివ్యవాణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago