మెగా స్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులకు పండగే.. రీ-ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు చిరు.. ఈ సినిమా రైతులకు సంబందించిన కథ ఆధారంగా చిరంజీవికి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. తదుపరి 151వ చిత్రం సైర నరసింహారెడ్డి సినిమా కూడా హిస్టారికల్ మూవీగా మరొక హిట్ ని చిరు ఖాతాలో వేసుకున్నాడు. ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో 152 వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చిరంజీవి సినిమా అనగానే అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోతాయి.
ఏ చిత్రం కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 90 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తీ చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నారట. అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన స్టిల్ ఒకటి లీక్ అయింది… చిరంజీవి నక్షలైట్ గా నటిస్తున్నాడు అంటూ.. వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. అందులో చిరు నక్షలైట్ గా చాలా ఇంటెన్స్ తో కనిపిస్తున్నారు.
ఇప్పటి వరకు చిరు నటించిన చిత్రాలలో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదనే చెప్పాలి. 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకునా కూడా అయన లో సత్తా ఏమాత్రం తగ్గలేదన్నట్టుగా సెలెక్టివ్ గా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నారు చిరంజీవి. మెగాస్టార్ తో కొరటాల శివ చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్ సినిమా అయినప్పటికీ అందులో సామజిక అంశాన్ని ప్రస్తావిచేలా కొరటాల ఈ కథను తెరకెక్కిస్తున్నారని వినికిడి.
అయితే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని సమాచారం. మరో పక్క రామ్ చరణ్ తో కూడా ఒక పాత్ర చేపించి అభిమానులకు సర్ప్రైజ్ చేసేందుకు సిద్దమవుతున్నాడట కొరటాల శివ. హీరోయిన్ గా త్రిష నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.. మరో భామ రెజీనా కూడా ఒక ఐటెం సాంగ్ లో తళుక్కుమంటుందట. కోకాపేటలో ఈ చిత్రానికి సంబందించిన ఒక భారీ సెట్ ను రెండు కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేశారట. మరో పక్క రెండు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ ఆగకుండా జరగాలని చిరు ఆర్డర్ వేసారట.
ఈ వయస్సులో కూడా చిరంజీవి స్పీడు చూసి షాక్ అవుతున్నారు టాలీవుడ్ వర్గాలు.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ, తమిళ హీరో ఆర్య కూడా నటిస్తున్నారని వినికిడి, ఆర్యకి, చిరుకి మధ్య కీలకమైన సీన్స్ ఉంటాయని, అవి సినిమా మొత్తానికే హైలెట్ గా నిలుస్తాయని ఈ సినిమా వర్గాల టాక్.
ఆల్రెడీ భారీ అంచానాలు ఉన్న ఈ సినిమా, ఇప్పుడు లీకులు వల్ల అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిపోతున్నాయి. మరి చిరు క్యాలిబర్ కు తగ్గ కథతో కొరటాల ఎలాంటి మెస్మరైజింగ్ సినిమాను ఆడిస్తాడా అని అభిమానులు చాలా ఆత్రుత తో ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…