అక్కినేని సమంతకు కోపం వచ్చింది.. ఎప్పుడు కూల్ గా ఉండే సమంతకి కోపం ఎందుకు వచ్చిందో తెలుసా… ఒక అభిమానికి వేలు చూపించి వెంటపడొద్దని చెప్పింది. దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే…
ఇటీవలే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల వెళ్లిన సమంతకి ఫాన్స్ నుండి ఇబ్బంది కలగడం జరిగింది. దర్శనానికి వెళ్లే సమయంలో ఫాన్స్ ఆమెతో ఫోటోలు దిగడానికి ప్రయత్నించగా కొంత అసహనానికి గురైనా.. ఆమె అభిమానుల కోరిక మేరకు కొంతమంది అభిమానులతో ఫోటోలు దిగింది. అందులో ఒక వ్యక్తి మాత్రం సమంత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి వీడియోలు తీయడం గమనించింది, ఆలా తీయవద్దని సహనంగా చెప్పినా వినకపోవడంతో సమంత ఆ వ్యక్తికి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చింది. సమంత తన సినిమా విడుదల సమయంలో తిరుమలకి వెళ్తూ ఉంటుంది. అయితే సినీ ప్రముఖులలకు ఇలాంటి సందర్భాలు ఎదురవడం సాధారణమే..
ఇటీవలే సమంత నటించిన “జాను” సినిమా విడుదల అయ్యింది. “96” రీమేక్ గా జాను సినిమాని తెరకెక్కించారు. ఇందులో శర్వానంద్, సమంత కలిసి నటించారు. ఈ సినిమాలో సమంత పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది కానీ అనుకున్న రీతిలో ప్రేక్షకులను సంతృప్తి పరచలేదని చెప్పొచ్చు. ఇప్పుడు సమంత విజయ్ సేతుపతి సరసన తమిళంలో “కాతు వాకుల రెండు కాదల్” అనే చిత్రానికి ఓకే చెప్పింది, ఈ చిత్రంలో నయనతార కూడా నటించనుండదట. అలాగే తెలుగులో ఎన్టీఆర్ 30వ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించనుంది అని సినీవర్గాల నుండి వినిపిస్తుంది
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…