జయమాలిని, సిల్క్ స్మిత, డిస్కో శాంతి లకు పోటీగా అనురాధ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. డ్యాన్స్ లో ఆమె కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన తరువాత వివాహం చేసుకున్న అనురాధ సినిమాలకు దూరం అయ్యారు. ఈమె కుమార్తె అభినయశ్రీ తల్లి బాటలోనే నడిచి తెలుగులో నృత్యతారగా పేరు తెచ్చుకుంది. మొదట ఆమె మలయాళంలో చేస్తున్న ఒక సినిమాలో డ్యాన్స్ నేపథ్యమున్న హీరోయిన్ క్యారెక్టర్ పోషించింది.
కుటుంబ పోషణ కోసం డ్యాన్స్‌లు చేసే పాత్ర అది. మామూలుగానే ఈవిడ మంచి నృత్యకారిణి. ఇక డ్యాన్స్ క్యారెక్టర్ కావడంతో చాలా బాగా చేసింది. ఆ సినిమాలో ఈవిడ నృత్యాలు చూసి రఘురాం మాస్టారు ఐటమ్‌సాంగ్‌లో నటించమని అడిగారు. అప్పట్లో ఆ పాటలకి సిల్క్‌స్మితని మించిన వాళ్లు లేరు. ఆమెకు ప్రత్యామ్నాయంగా డ్యాన్స్ మాస్టర్లు ఈవిడను అడిగి, ఒప్పించేశారు. చేసిన ప్రతి పాట హిట్టే. దీనితో ఈవిడకూ క్రేజ్ పెరిగింది. దీంతో అవే పాత్రలు రావడం మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. ఆమెపై మొదట్లో ఎన్నో రూమర్లు పుట్టుకొచ్చాయి.
చివరకి ఆమె వాటిని నిజం చేసింది. అసలేం జరిగిందంటే.. ఓ రోజు అనురాధ ఎవరితోనే లేచిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అతడు ఎవరో కాదు సతీశ్ కుమార్ అనే కొరియోగ్రాఫర్ కానీ ఆమెకు అతడితో కేవలం స్నేహం మాత్రమే ఉండేదట. కానీ వాళ్లు వీళ్లు రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లట. చివరకు వాళ్ల అమ్మ కూడా ఓరోజు అతడితో వాళ్ల ఇంటి దగ్గర మాట్లాడుతుండగా.. ఎవరో చూసి వాళ్ల అమ్మకు చెప్పారట. దీంతో ఆమె సతీశ్ వాళ్ల ఇంటికి ఫోన్ చేసి మరీ తిట్టిందట.
దాంతో ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఆమె అతడినే పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు అభినయశ్రీ, కాళీచరణ్ ఉన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత ఒక బైక్ యాక్సిడెంట్‌లో సతీశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడు ఏ పని చేసుకోకుండా ఉండేవారు. తర్వాత 2007 సంవత్సరంలో అతడు భోజనం చేస్తుండగా ఒక్కసారిగా పొలమారడంతో చనిపోయారు. ఇలా ఆమె ఎన్నో కష్టాలను అనుభవించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…