సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా ద్వారానో, లేదా వారు పోషించిన పాత్రల ద్వారానో గొప్ప పేరు సంపాదించుకుంటారు. అంతేకాదు మొదటి సినిమానే తమ ఇంటి పేరుగా మార్చుకున్న నటీ నటులు సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కేవలం నటులు మాత్రమే కాదు దర్శకులు కూడా ఉండటం విశేషం. ఆహుతి సినిమాతో ఆహుతి ప్రసాద్‌గా మారిన ప్రసాద్ అందరికీ సుపరిచితుడు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ కూడా తన మొదటి సినిమా దేవీ నే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఇలాంటి వారి జాబితాలో కొల్లూరి చిదంబరం కూడా వస్తారు. ఆయనే ఆ తర్వాత కళ్ళు చిదంబరంగా సినిమాలలో నటించి బాగా పాపులర్ అయ్యారు.
కళ్ళు చిదంబరం 1945, అక్టోబర్ 10 న విశాఖపట్నంలో జన్మించాడు. నాటకాల మీద ఆసక్తితో పలు చోట్ల నాటకాలు వేసి ఆ రంగంలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. సాధారణంగా నాటక రంగం నుంచి వచ్చిన ఎవరైనా సినిమాలలో బాగా రాణించిన వారే. అది దర్శకుడిగా, నటుడిగా అయినా, సంగీత దర్శకుడిగా.. మరే విభాగంలోనైనా. సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చెప్పాలంటే అప్పటి గొప్ప నటీ నటులను ఈ నాటికి గుర్తు చేసుకుంటున్నామంటే అది నాటక రంగం వల్లే అని చెప్పాల్సిందే.
అలా నాటకరంగం నుంచి కళ్ళు అనే సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమైన నటుడు కళ్ళు చిదంబరం హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కళ్ళు చిదంబరం 300లకు పై చిలుకు సినిమాల్లో నటించారు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన కొద్దిసేపైనా మంచి గుర్తుండిపోయే పాత్రలను ఎన్నో చేశారు. ఆయన పండించే కామెడీ అన్నీ వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి. మొదటి సినిమా కళ్లు హాస్య నటుడిగా మంచి పేరు తీసుకు రావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఆయనకి కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు.. ఆ తర్వాత నటించిన చంటి, గోల్‌మాల్ గోవిందం, మనీ, పెళ్ళిపెందిరి, పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒక రోజు, అదిరిందయ్యా చంద్రం, అడవిచుక్క, తొలిపరిచయం, చంటిగాడు, ఐతే ఏంటి, అతడెవరు వంటి సినిమాలలో నటించి బాగా పాపులర్ అయ్యాడు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
ముఖ్యంగా కొన్ని సినిమాలలోని పాత్రలు ఆయన కళ్ళ మీద రాసినవే. అంతేకాదు కొన్ని సినిమాలలోని పాత్రలకి తన కళ్ళను ఆధారంగా చేసుకొని రచయితలు డైలాగులు రాసి ఆయనతో నటింపచేశారు. ఇది ఒకరకంగా సంతోషించాల్సిన విషయం అయినా కూడా దాన్ని లోలోపల ఆయన బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయట. అందుకే ఆయన చాలా సందర్భాలలో నేను కళ్ళు మూసేలోపు నా కళ్ళను బాగు చేయించుకుంటానని అనేవారు. తనకి మెల్లకన్ను ఉండటంతో కొన్ని పాత్రలు వెతుక్కుంటూ
వచ్చినప్పటికీ కొన్నిసార్లు తన కళ్ళ మీద వేసుకొనే జోకులు విని బాధపడిన సందర్భాలు ఉన్నాయి.
అందుకే చాలా పంతంగా తన కళ్ళను ఆపరేషన్ చేయించి బాగు చేయించుకోవాలనుకున్నారు. కానీ అది కుదరకుండానే ఆయన మరణించారు. ఇప్పటికి ఆయన నటించిన సినిమాలను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా కళ్ళు చిదంబరం కొంతకాలం అనారోగ్యంతో బాధపడి విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, అక్టోబరు 19 సోమవారం ఉదయం కళ్ళు మూశారు. ఇలాంటి నటులు చాలా అరుదుగా ఉంటారనడంలో ఎలాంటి సందేహాలు లేవనే చెప్పాలి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…