లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)కు జిల్లా వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. ఓ బాధితుడి బీమా క్లెయిమ్ విషయంలో సరిగ్గా సమాధానం చేప్పకపోవడం.. సదరు వ్యక్తి బీమాను తిరస్కరించినందుకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం ఎల్ ఐసీని రూ.15.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి 2012లో జీవన్ ఆనంద్ కింద రూ.5 లక్షల బీమా కవరేజీ, న్యూ బీమా గోల్డ్ కింద రూ.10 లక్షల బీమా కవరేజీపాలసీని తీసుకున్నాడు. అయితే అతడు కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చినిపోయిన సదరు వ్యక్తి తండ్రి పేరు రాములు. బీమా క్లెయిమ్ కోసం రాములు తన మైనర్ మనవరాళ్ల తరపున జూలై 6, 2012న ఎల్‌ఐసీకి క్లెయిమ్‌ను సమర్పించాడు. అయితే చనిపోయిన సదరు వ్యక్తి తన ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారం వెల్లడించలేదని.. మునుపటి పాలసీల గురించి కూడా తమకు తెలపలేదని బీమా క్లెయిమ్‌ను ఎల్ ఐసీ తిరస్కరించింది.
దీనిపై వాళ్లు హైదరాబాద్ వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించారు. మరణించిన వ్యక్తి పాలసీలో కేవలం ఒక విషయం గురించి మాత్రమే ప్రకటించలేదని బెంచ్ తెలిపింది. జూన్ 13,2012 నాటి డిశ్చార్జ్ సారాంశం ప్రకారం.. బీమా చేసిన వ్యక్తి గత ఆరు నెలలుగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, అయితే ఈ పాలసీని జూలై 27,2011న తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఫిర్యాదుదారుడు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను అణచివేస్తున్నట్లు రికార్డులో ఏమి లేదు అని బెంచ్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును వినియోగదారుల ఫోరం జూలై 25వ తేదీన వెల్లడించింది.
క్లెయిమ్‌ను తిరస్కరణకు సంబంధించి సరైన సమాచారాన్ని వెల్లడించకుండా వారి వాదనను తిరస్కరించినందుకు ఫిర్యాదుదారుడికి 15.5 లక్షల రూపాలయలను చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం ఎల్‌ఐసీని ఆదేశించింది. అంతేకాకుండా 9 శాతం వడ్డీతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది. అలాగే వాటితో పాటు ఫిర్యాదుదారుడు కోర్టు ఖర్చుల కింద కూడా మరో రూ. 5000 చెల్లించాలని ఆదేశించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…