లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కు షాక్.. రూ.15.5 లక్షలు పరిహారం చెల్లించాలంటూ ఆదేశం..?

0
75

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC)కు జిల్లా వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. ఓ బాధితుడి బీమా క్లెయిమ్‌ విషయంలో సరిగ్గా సమాధానం చేప్పకపోవడం.. సదరు వ్యక్తి బీమాను తిరస్కరించినందుకు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం ఎల్ ఐసీని రూ.15.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి 2012లో జీవన్‌ ఆనంద్‌ కింద రూ.5 లక్షల బీమా కవరేజీ, న్యూ బీమా గోల్డ్‌ కింద రూ.10 లక్షల బీమా కవరేజీపాలసీని తీసుకున్నాడు. అయితే అతడు కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చినిపోయిన సదరు వ్యక్తి తండ్రి పేరు రాములు. బీమా క్లెయిమ్ కోసం రాములు తన మైనర్‌ మనవరాళ్ల తరపున జూలై 6, 2012న ఎల్‌ఐసీకి క్లెయిమ్‌ను సమర్పించాడు. అయితే చనిపోయిన సదరు వ్యక్తి తన ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారం వెల్లడించలేదని.. మునుపటి పాలసీల గురించి కూడా తమకు తెలపలేదని బీమా క్లెయిమ్‌ను ఎల్ ఐసీ తిరస్కరించింది.

దీనిపై వాళ్లు హైదరాబాద్ వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించారు. మరణించిన వ్యక్తి పాలసీలో కేవలం ఒక విషయం గురించి మాత్రమే ప్రకటించలేదని బెంచ్‌ తెలిపింది. జూన్‌ 13,2012 నాటి డిశ్చార్జ్‌ సారాంశం ప్రకారం.. బీమా చేసిన వ్యక్తి గత ఆరు నెలలుగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, అయితే ఈ పాలసీని జూలై 27,2011న తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఫిర్యాదుదారుడు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను అణచివేస్తున్నట్లు రికార్డులో ఏమి లేదు అని బెంచ్‌ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును వినియోగదారుల ఫోరం జూలై 25వ తేదీన వెల్లడించింది.

క్లెయిమ్‌ను తిరస్కరణకు సంబంధించి సరైన సమాచారాన్ని వెల్లడించకుండా వారి వాదనను తిరస్కరించినందుకు ఫిర్యాదుదారుడికి 15.5 లక్షల రూపాలయలను చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం ఎల్‌ఐసీని ఆదేశించింది. అంతేకాకుండా 9 శాతం వడ్డీతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది. అలాగే వాటితో పాటు ఫిర్యాదుదారుడు కోర్టు ఖర్చుల కింద కూడా మరో రూ. 5000 చెల్లించాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here