అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుమంత్ 1999లో సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ప్రేమ కథ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. తన మేనమామ నాగార్జునే ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం.
కానీ ‘ప్రేమకథ’ చిత్రం అప్పట్లో ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ‘సత్యం’ ‘గౌరి’ ‘మళ్ళీ రావా’ వంటి హిట్ చిత్రాలు సుమంత్ కెరీర్ కు ఉపయోగ పడ్డాయి. ‘గోదావరి’ ‘మధుమాసం’ ‘సుబ్రహ్మణ్యపురం’ వంటి యావరేజ్ చిత్రాలతో మంచి నటుడుగా నిరూపించుకున్న సుమంత్ ఈమధ్య విడుదలైన NTR బయోపిక్ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు పాత్ర పోషించాడు. అయితే కెరీర్ ప్రారంభంలోనే సుమంత్ తన తాతయ్య, మావయ్యలతో కలిసి నటించి పెద్ద తప్పు చేశానంటూ మీడియా ముందు పెద్ద షాకే ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ.. ”మా తాత అక్కినేని నాగేశ్వరరావు, మేనమామ నాగార్జునతో కలిసి సినిమాలలో నటించడం జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు.
నాగార్జునతో కలిసి మలయాళంలో హిట్టైన ‘ఫ్రెండ్స్’ అనే చిత్రానికి రీమేక్ గా రూపొందించిన ‘స్నేహమంటే ఇదేరా’ చిత్రంలో నటించాను. 2001లో విడుదలైన ఈ చిత్రం ఫ్లాపవుంతుందని నాకు ముందే తెలుసు. ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని షూటింగ్ టైంలోనే అనుకున్నాను. కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఈ చిత్రంలో వాస్తవంగా మామ అల్లుళ్లమైన మేమిద్దరం సినిమాల్లో ఫ్రెండ్స్ గా నటించడమనే కాన్సెప్ట్ ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యరని ముందే ఊహించాను. టాలీవుడ్ లో కూడా ఈ స్క్రిప్ట్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య, విజయ్ లు రీమేక్ చేసారు. మలయాళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సిద్దిక్ అదే ‘ఫ్రెండ్స్’ పేరుతో తమిళ్ లో రీమేక్ చేసాడు. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్టైంది. తెలుగులో మాత్రం ఫ్లాపయ్యింది. అప్పటికే మావయ్య నాగార్జునతో 2 సూపర్ హిట్స్ ను సాధించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్ధ ఈ సినిమా నిర్మిస్తుందని చెప్పారు కాబట్టి ఓకే చెప్పాను. ఈ చిత్రంలో మేనల్లుడైన నేను… మేనమామైన నాగార్జునను కొట్టే సీన్ ఉంది. ఆ సన్నివేశాన్ని షూట్ చేసేటప్పుడు నాకు చాలా బాద వేసింది. అందుకే ఆ సినిమా చేయడం నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఫీలవుతుంటాను.
ఇలాగే గతంలో తాతయ్య నాగేశ్వర రావు గారితో ‘పెళ్లి సంబంధం’ సినిమాలో నటించాను. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఫోర్స్ చేయడంతో ఆ చిత్రంలో నటించాను. కానీ ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. సినీ రంగంలోకి వచ్చిన క్రొత్తలో తాతయ్య, మామయ్యలతో కలిసి వెండితెరపై కనబడాలనే ఆతృతతో నేను ఆ చిత్రాలలో నటించాను. కానీ ఆ 2 చిత్రాల కధల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేక పోయాను” అంటూ తెలియజేశాడు హీరో సుమంత్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…