Categories: FeaturedMovie News

రియల్ ఎస్టేట్ స్కామ్ లో దారుణంగా మోసపోయిన సినీ తారలు !! (భారతరత్న సచిన్ భార్య కూడా ఈ స్కామ్ లో ఇరుక్కోవడం విశేషం)

డబ్బెవరికి చేదు.. చెప్పండి. ఈజీగా డబ్బు వస్తుందంటే వెనుకా ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుంటారు.  ఇలాంటి వారి బలహీనతలను ఆసరాగా తీసుకుని కొంతమంది మోసాలు చేస్తూ ఈజీగానే డబ్బు సంపాదించేస్తున్నారు. మరికొంత మంది మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా ఫేస్ బుక్, వాట్సాప్ ల ఆధారంగా అమాయకులను ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోనైతే ఈ మోసాలు మరీ ఎక్కువగానే జరుగుతుంటాయనడానికి ఉదాహరణే ఇప్పుడు మీరు చదవబోయే ఈ ఆర్టికల్.

రియల్ ఎస్టేట్ పేరుతో సంపన్నులను ఈజీగా మోసం చేసే దృశ్యాలను చాలా సినిమాల్లో చూసే వుంటారు. ఈ తరహా సీన్లలో బిల్డర్లు అక్రమ భూములను చూపించి కోట్ల సొమ్మును కాజేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ లో బిగ్ సెలెబ్రీటీలైన సచిన్ టెండూల్కర్ భార్య అంజలితోపాటు సినీ తారలైన నయనతార, రమ్యకృష్ణ వంటివాళ్ళు ఇరుక్కోవడమే..! ఏంటి.. ఆశ్చర్యపోతున్నారా.?! మీరు నమ్మినా నమ్మక పోయినా ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ యధార్ధంగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఇద్దరు బిల్డర్ల మధ్య మనస్ఫర్ధలు రావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఎన్నో వ్యాపారాలకు కేంద్రమైన మన భాగ్య నగరంలోనే ఈ ఘరానా మోసం జరగడం విశేషం. హైద్రాబాద్ కు సమీపంలోని రావిర్యాల ప్రాంతంలో వున్న కొన్ని భూములను సచిన్ భార్య అంజలి, సినీ తారలు నయనతార, రమ్యకృష్ణలకు విక్రయించారని తెలిసింది. వాస్తవానికి ఆ భూములు చెరువుకు సంబంధించిన భూములని, అక్కడ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదనే సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని కోటా రెడ్డి, సుధీర్ రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కు సంబంధించిన వివాదం నడుస్తుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా వీళ్ళిద్దరి వివాదం వలన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోటా రెడ్డి చేసిన మోసాలను సుధీర్ రెడ్డి బహిరంగంగా తెలియజేస్తూ.. కోటా రెడ్డిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

అంతేకాకుండా భారత రత్న సచిన్‌ టెండూల్కర్ ను మోసం చేసినందుకు కోటా రెడ్డిపై భారత రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి కూడా సుధీర్ రెడ్డి లేఖ రాశాడు. అవి చెరువులకు సంబంధించిన భూములే అయినా వాటిని అత్యధిక రేటుకు అమ్మారని, సచిన్‌కు 6 ఎకరాలు, రమ్యకృష్ణ, నయన తారలకు చెరో ఎకరం అమ్మారని సుధీర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇంతవరకూ సచిన్‌కు ఆ భూముల సంగతే తెలియదట. ఆ భూములను అభివృద్ది చేస్తానని చెప్పిఅమ్మారంట.

అయితే ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ పై సినీ తారలైన నయనతార గానీ, రమ్యకృష్ణ గానీ ఇంతవరకు స్పందించకపోవడం గమ్మత్తైన విషయం. కోట్ల రూపాయలు చేజారి పోతున్నా పట్టించుకోకుండా ఉన్నారు. సినిమాలే లోకంగా బ్రతికే సినీతారలకు ఇలాంటి మోసాలు, వ్యాపారాల గురించి తెలుసో.. లేదో లోగుట్టు పెరుమాళ్ళకెరుక. కానీ., ఇంతకీ ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ విషయమై సచిన్ భార్య అంజలి, నయనతార, రమ్యకృష్ణలు స్పందిస్తారా.. లేదన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

5 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

5 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

5 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

5 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

5 months ago