Liger Movie: విజయ్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో నటించిన చిత్రం లైగర్.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్న నేపథ్యంలో ఈ సినిమాని బాయికాట్ చేయాలంటూ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
ఇకపోతే శనివారం విజయవాడలో లైగర్ చిత్ర బృందం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఆల్రెడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా బాయ్ కాట్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మనం నిజాయితీగా ధర్మంగా ఉన్నప్పుడు ఎవరి మాట వినేది లేదనీ ఈయన వెల్లడించారు.
గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడటమే కాకుండా తల్లి సెంటిమెంట్ తో భారతీయ జెండాను ఎగరవేస్తే బాయ్ కాట్ చేస్తారా? మనం ధర్మంగా ముందుకు వెళుతున్నప్పుడు ఎవడు అడ్డు వచ్చినా వినేది లేదు కొట్లాడుడే అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ గారు ఈ సినిమా కథ చెప్పగానే నాకు మెంటల్ వచ్చేసింది.
ఈ కథ వినగానే వెంటనే చేసేదామని చెప్పాను. ఇలా ఈ సినిమా కోసం మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామని, సినిమా ఏ మాత్రం ఆగదు అంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించగా విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…