Amith Sha : బీజేపీలో ప్రధాని మోడీ ముందుంటే వెనకనుండి నడిపే రథ సారధి అమిత్షా. బీజేపీ వ్యూహకర్త అమిత్ షా ప్రస్తుతం తెలంగాణ పర్యటన చేయనున్నారు. మునుగోడు బహిరంగ సభలో పాల్గొనడానికి తెలంగాణ వస్తున్న అమిత్షా టూర్ లో చిన్న మార్పు జరిగింది. అదే అమిత్ షా యంగ్ టైగర్ ని కలవబోతున్నాడు. సినిమా ఇండస్ట్రీ లోనూ అటు రాజకీయవర్గలలోనూ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీలో ఏం జరుగుతుందో ఎలాంటి టాపిక్ చర్చకు వస్తాయో తెలియదు.
కొమరం భీమ్ ని కలవడం కోసం హోం మంత్రి…
అమిత్ షా గతంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా చూసానని, అందులో కొమరం భీమ్ పాత్ర చాలా నచ్చిందని వీలైతే ఎన్టీఆర్ ను కలవాలని ఉందని తన కోరిక చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇపుడు తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్ షా పనిలోపనిగా యంగ్ టైగర్ ను కలవనున్నాడు. డిన్నర్ కు ఆహ్వానించాడు. ఇందుకోసం 15 నిమిషాల సమయం కేటాయించారు కేంద్ర మంత్రి. సాయంత్రం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఎన్టీఆర్ ను డిన్నర్ కు ఆహ్వానించారు అమిత్ షా. ఇక ఖచ్చితంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన విషయాలు చర్చకు రావచ్చని అందరూ భావిస్తున్నారు.
మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ చేరుకుంటున్న అమిత్ షా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం కార్యకర్త ఇంటికి వెళ్ళనున్నారు. తరువాత 3 గంటల ప్రాంతంలో రైతు నేతలతో సమావేశంలో పాల్గొంటారు. 4:40 నిమిషాలకు మునుగోడు సీఆర్పిఎఫ్ అధికారులతో సమావేశం ఆ తరువాత మునుగోడు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తరువాత హైదరాబాద్ లో ముఖ్య నేతలతో సమావేశం అనంతరం 9 గంటలకు ఢిల్లీ తిరిగి వెళ్ళిపోతారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…