Featured

Varalakshmi : నా భర్త పనిచేసేది కీరవాణి, సింగర్ సునీత దగ్గర… వేదిస్తున్నాడని సింగర్ సునీతకు కాల్ చేస్తే ఎలా మాట్లాడిందంటే.. : వరలక్ష్మి

Varalakshmi : అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు వంటివి వింటూనే ఉంటాము. రోజూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. అత్తింటి ముందు ధర్నాలు పోలీస్ కేసులు ఇవన్నీ కూడా రోజూ చూస్తున్నవే, వీటిలో ఎంతమందికి న్యాయం జరుగుతోందో కుడా తెలియదు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటి పడుతున్నారు ఈ రోజుల్లో, ఇంకా ఇలా కట్నాలు కానుకల్తో పెళ్లిళ్లు చేస్తున్న అమ్మాయిల తల్లిదండ్రులను తప్పుబట్టాలో లేకపోతే కొడుకును బేరానికి పెట్టే తల్లిదండ్రులను తప్పుబాట్టాలో తెలియదు. ఇక పోతే ఇలాంటి ఒక ఘటన ఇప్పుడు హైదరాబాద్ లో ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి మహిళను అదనపు కట్నం కోసం వేదిస్తూ ఉన్నారని ధర్నాకు దిగింది.

సునీత కు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసింది…

అరవింద్ అనే వ్యక్తి వరలక్ష్మి అనే అమ్మాయి ని పెళ్లి చేసుకుని తొమ్మిది నెలలుగా వేదిస్తున్నాడు. అదనపు కట్నం కోసం టార్చర్ చేస్తున్నాడు. ఇక అత్త, మామ ఆడ పడుచు కూడా వేదిస్తూ ఇంట్లోనే బందించారు అంటూ బాధిత మహిళ మాట్లాడారు. తన భర్త మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ దగ్గర కీ బోర్డు ప్లేయర్ గా పనిచేస్తున్నాడు. ఎమ్ టెక్ చదివిన వరలక్ష్మి ని తల్లిదండ్రులు ఇండస్ట్రీకి సంబంధిచిన వ్యక్తి నెలకు ఆరు లక్షలు జీతం అని అరవింద్ కి ఇచ్చి పెళ్లి చేసారు. పెళ్లి సమయంలో యాభై తులాల బంగారం, యాభై లక్షల కట్నం ఇచ్చారు. అదంతా అత్త దగ్గరే పెట్టుకుని తనను అదనపు కట్నం కోసం వేదిస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపించింది. ఇక సింగిర్ సునీత ఫోన్ నెంబర్ తీసుకుని అరవింద్ గురించి చెప్పి న్యాయం చేయని అడిగితే ఇలా ఫోన్ చేయొద్దు, నా దాకా వస్తే చూస్తా ఇలాంటి విషయాల కోసం నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ కట్ చేసింది అంటూ వరలక్ష్మి ఆరోపించింది.

ఇక సింగర్ సునీత ఆ రికార్డింగ్ ను అరవింద్ కి పంపినట్లు అరవింద్ అందరి దగ్గర చెప్పుకుంటున్నాడని వరలక్ష్మి ఆరోపించారు. ఇండస్ట్రీ లో పలుకుబడి ఉందని తెలిసిన రౌడీల ద్వారా తన తండ్రి, సోదరులను చంపిస్తానని బెదిరించాడని వరలక్ష్మి ఆరోపించింది. తాను పల్లెటూరు అమ్మాయిని కావడం వల్ల అందరిలో పరిచయం చేయలేనని, ఇంతవరకు తనకు పుస్తెల తాడు కూడా చేయించలేదని, పెళ్లయ్యాక ఇరవై రోజులు ఆనందంగా ఉన్నానని, ఆ తరువాత ఆడపడుచు తన భర్తతో ఉండనిచ్చేది కాదని ఇంకా కట్నం తెస్తేనే భర్త దగ్గరికి పంపుతామని తిట్టేవారు. ఇక ఒక రోజంతా బాత్ రూమ్ లోనే ఉంచి టార్చర్ చేసారని వరలక్ష్మి ఆరోపించారు.

Bhargavi

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

8 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

8 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

8 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

8 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

11 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

11 hours ago