Karthikeya 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై ఈయన స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కార్తికేయ 2 సినిమా ఇష్యూ గురించి ఈయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విడుదలయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా వాయిదా పడటం వెనుక దిల్ రాజు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిఖిల్ సైతం పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా నిఖిల్ తాను ఎక్కడ దిల్ రాజు పేరు ఉపయోగించలేదని ఈ సినిమా ఇంత మంచి విజయం అయిందంటే అందుకు దిల్ రాజే కారణం అంటూ ఒక్కసారిగా మాట మార్చారు.
ఇక ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ సాధారణంగా ఒక సినిమా విడుదలవుతుందంటే మరొక సినిమాని వాయిదా వేసుకోమని చెప్పడం ఎప్పటినుంచో జరుగుతుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు కూడా తన సినిమా విడుదలవుతుందని కార్తికేయ2 టీమ్ కి ఫోన్ చేసి సినిమా వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారని ఈయన వెల్లడించారు.ఈ విధంగా దిల్ రాజు వంటి వారి ఈ సినిమా వాయిదా వేసుకోమని ఫోన్ చేశారంటే నిజంగా నిఖిల్ ఎంతో గర్వపడాలని ఈయన వెల్లడించారు.
దిల్ రాజు గారు కార్తికేయ 2సినిమా హిట్ అవుతుందని ముందే ఊహించారు. అందుకే సినిమాని వాయిదా వేసుకోమని ఫోన్ చేసి ఉంటారని ఈయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా హిట్ కాదని తెలిస్తే వాయిదా వేసుకోమని చెప్పే అవసరం దిల్ రాజుకి ఉండదంటూ తెలిపారు. ఈ విధంగా దిల్ రాజు కార్తికేయ 2 సినిమా విజయవంతం అవుతుందని ముందే ఊహించి ఈ సినిమాకి భయపడి నిఖిల్ సినిమాని వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారంటూ తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…