Featured

Imandi Ramarao : హీరో నితిన్ కెరీర్ ముగిసినట్లేనా… నితిన్ జీవితంలో ఈ ఇబ్బందులకు కారణం అతనేనా? : ఇమంది రామారావు

Imandi Ramarao : డిస్ట్రిబ్యూషన్ రంగంలో నెంబర్ వన్ గా ఉన్న సుధాకర్ రెడ్డి గారి కొడుకుగా సినిమాల్లోకి వచ్చిన హీరో నితిన్ మొదటి సినిమా ‘జయం’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కొన్ని ప్లాప్ లు వచ్చినా వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ‘దిల్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘సై’ మంచి విజయాన్ని అందుకుంది. అయితే హిట్లకంటే ప్లాప్ లనే ఎక్కువ అందుకున్న నితిన్ కెరీర్ లో దాదాపు పదేళ్ళు విజయాలు లేవు. అయినా మళ్ళీ ‘ఇష్క్’ సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక నితిన్ ఇరవై ఏళ్ల సినిమా కెరీర్ గురించి సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఎనాలిసిస్ చేసారు.

కెరీర్ లో ఇబ్బందులకు ఆయనే కారణం…

ఇమంది రామారావు గారు నితిన్ కెరీర్ గురించి మాట్లాడుతూ అయన తండ్రి సుధాకర్ రెడ్డి గారికి సినిమాల మీద చాలా పట్టు ఉందని ‘యముడికి మొగుడు’ వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పారు. ఒకప్పుడు ఆయన సినిమా చూసి బాగుందన్నాడంటే సినిమా ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం దర్శక నిర్మాతలకు ఉండేదని చెప్పారు. అయితే కొడుకు సినిమాల సెలక్షన్ ఇప్పటికి సుధాకర్ రెడ్డి గారు చూస్తారు, సినిమా కోసం చాలా ఖర్చుపెడుతున్నారు కానీ సినిమా ఆయన అంచనాలను తప్పు చేస్తోంది. ఇప్పడున్న వారికి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అంచనా వేయలేకపోతున్నారంటూ చెప్పారు. మంచి చేయాలనే అనుకుని కొడుకు కెరీర్ ను ఇబంధుల్లో పెడుతున్నారు.

ఇన్ని ఫెయిల్యూర్స్ తరువాత మళ్ళీ ఇష్క్ సినిమాతో హిట్ కొట్టాడు. మళ్ళీ ‘భీష్మ’ తరువాత వరుస ప్లాప్ లు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం కూడా ఘోరంగా నిరాశపరిచింది అంటూ వాఖ్యాణించారు. హీరో తరుణ్ విషయంలో కూడా తన తల్లి సినిమా కథ దగ్గరి నుండి సినిమాలో నటించే వాళ్లందరి గురించి అడగడం, వేలు పెట్టడం వళ్లే అతని కెరీర్ కూడా ప్రశ్నార్థకం అయింది. అయితే నితిన్ సినిమా విషయంలో ఇప్పటికీ మించి పోయింది లేదు. సరైన జాగ్రత్తలు తీసుకుని కథల ఎంపిక విషయంలో నితిన్ కి స్వేచ్ఛ సుధాకర్ రెడ్డి గారు ఇస్తే బాగుంటుంది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago