Small Screen Bachelors : మునుపటి కాలంలో పాతిక సంవత్సరాలు అంటేనే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టేవారు. కానీ ఇప్పుడు మూడు పదుల వయస్సు వచ్చినా చదువు, లైఫ్ సెటిల్మెంట్ వంటి కారణాలు చూపుతూ పెళ్లి ఆలోచన కూడా చెయ్యట్లేదు. వెండి తెర మీద అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మందే వున్నారు. అందులో ప్రభాస్ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఇక బుల్లితెర మీద కూడా ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. మూడు పదుల వయసు దాటినా బాచిలర్ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు.
ఏజ్ బార్ అయిపోయిన బుల్లితెర స్టార్స్…
బుల్లితెర మీద పెళ్లికాని ప్రసాదులలో నేను ముందు ఉన్నానంటాడు ప్రదీప్. ప్రస్తుతం ప్రదీప్ వయసు 34 సంవత్సరాలు. బుల్లితెర మీద పలు టీవీ ప్రోగ్రాములకు హోస్ట్ గా వ్యవహారిస్తూ మరో వైపు సినిమాలలో హీరోగా కూడా చేస్తున్నాడు. అత్యంత బిజీగా ఉండే యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోకుండా బాచిలర్ గానే ఉన్నాడు. ఇక బుల్లితెర మీద బిజీ గా ఉండే నటులలో మరొకరు సుధీర్. ప్రోగ్రాములకు హోస్ట్ గానే కాకుండా ఈయన కూడా సినిమాలలో హీరోగా కూడా చేస్తున్నాడు. సుధీర్ వయసు 33 సంవత్సరాలు. అయితే సుధీర్ కూడా ఇప్పటికి బాచిలర్ గానే ఎంజాయ్ చేస్తున్నాడు.
బుల్లితెర మీద పంచుల సునామి సృష్టించే హైపర్ ఆది కూడా పెళ్లికాని ప్రసాదే. ఆది వయసు ప్రస్తుతం 31 ఏళ్ళు. బుల్లితెర మీద అమ్మాయిలు కూడా మూడు పదుల వయసు దాటినా పెళ్లిచేసికోని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో ముందున్నది రష్మీ గౌతమ్. ఈమె వయసు గూగుల్ ప్రకారం అయితే 32 ఏళ్ళు. కానీ అయిదేళ్ల నుండి ఈమెను 30 సంవత్సరాలు దాటిందనే చెబుతుంటారు. నిజం వయసు గురించి సరిగా తెలియదు కానీ ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా ఉంది. ఈ జాబితా లోకి విష్ణుప్రియ కూడా వస్తుంది. సినిమాలు టీవీ షోలు చేసుకొనే ఈమె వయసు 33 సంవత్సరాలు. అయితే ఈమె కూడా పెళ్లి చేసుకోలేదు. ఇలా జాబితా చాలానే వుంది. వీరందరు బుల్లితెర మీద స్టార్స్ గా రాణిస్తున్న ఎందుకో మరి పెళ్లి ఆలోచన చెయ్యట్లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…