తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సుధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి ఎన్నో వందల చిత్రాలలో తల్లి పాత్రలో అద్భుతంగా నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా తన జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తను పుట్టడమే డైమండ్ స్పూన్ తో పుట్టానని, చివరికి అల్యూమినియం స్పూన్ కూడా దొరకని పరిస్థితికి వెళ్లానని తన జీవితంలో జరిగిన ఒడిదుడుకులు గురించి వెల్లడించారు.
తనకు 4అన్నయ్యలు ఒక తమ్ముడు అని ఎక్కడికి వెళ్లిన వారు తనను ఎంతో బాగా చూసుకునే వారని సుధ వెల్లడించారు. అయితే తన తండ్రికి క్యాన్సర్ రావడం వల్ల ఉన్న డబ్బులు మొత్తం నాన్నకు చికిత్సకు సరిపోయాయని ఆ సమయంలో ఎన్నో కష్టాలను అనుభవించామని అలా నాన్నకు అనారోగ్యం చేయటం వల్లే కుటుంబం కోసం తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని సుధా తెలియజేశారు.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నటిగా మంచి గుర్తింపు సంపాదించుకునప్పటికీ తాను బాగా మోసపోయానని వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు షూటింగుకి వెళ్తే ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చే దాన్ని ఆ సమయంలో తనకు కావలసిన పనులను చేయడం కోసం పూర్తిగా మరొకరిపై ఆధారపడ వలసి వచ్చిందని ఇలా వేరొకరిని నమ్మి వారి చేతుల్లో తాను సంపాదించిన డబ్బులు పెట్టడం వల్ల పూర్తిగ మోసపోయానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
అప్పట్లో సావిత్రి ఏ విధంగా అయితే ఇతరులను నమ్మి తన సర్వస్వం కోల్పోయిందో ఒకానొక సమయంలో నేను కూడా అలాగే ఎంతో డబ్బును నష్టపోయానని సుధా వెల్లడించారు. అయినా నా కష్టాన్ని దోచుకొని తిన్న వారికి ఏమాత్రం సహించదని, ఇది తప్పుని వారు తెలుసుకున్నప్పుడే ఈ విధమైనటువంటి తప్పులు జరగవని ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన డబ్బు గురించి తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…