తెలుగు సినీ నటిగా అందరికీ సుపరిచితమైన వారిలో నటి జ్యోతి ఒకరు. ఈమె ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె వాంప్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఒకానొక సమయంలో నటి జ్యోతి గురించి గతంలో డ్రగ్స్ కేసులో ఈమె ఇరికించడంతో అప్పట్లో ఈ విషయం ఎంతో సంచలనంగా మారింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి ఈ విషయం గురించి స్పందించారు.ఈ విషయంలో తన ప్రమేయం ఏ మాత్రం లేదని ఇంట్లో ఉన్న నన్ను తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించారని ఆమె వెల్లడించారు. ఒకవేళ ఆ తప్పు నేను చేసి ఉంటే సాక్షాలు చూపించండి అంటూ ఈ సందర్భంగా ఈమె నిలదీశారు.
అప్పుడే నా భర్త నుంచి విడాకులు ఇవ్వడం, తన తండ్రి మరణంతో తను ఎంతో డిప్రెషన్లో ఉన్నానని, ఇలా డిప్రెషన్ లో ఉన్న నన్ను ఈ విధంగా ట్రాప్ చేసి డ్రగ్స్ కేసులో ఇరికించడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అప్పటికింకా నాకు కేవలం రెండు సంవత్సరాల బాబు ఉన్నారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. కేవలం ఒక కేసును తప్పుదోవ పట్టించడం కోసం కావాల్సిగానే నన్ను ట్రాప్ చేసి హైలెట్ చేశారని, అయితే ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులోకి లాగారో ఇప్పుడు వాళ్లు చాలా అనుభవిస్తున్నారని ఈమె వెల్లడించారు.
ఈ క్రమంలోనే తన తల్లి రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి మృతి చెందింది. తన భార్య మరణించి ఎంతో బాధ అనుభవిస్తున్నారని నా గురించి చెడుగా మాట్లాడిన వారు నాకు అన్యాయం చేయాలనుకున్న వారందరూ పూర్తిగా అనుభవిస్తున్నారని, కర్మ ఎప్పుడూ కూడా తన అడ్రస్ మర్చిపోవదంటూ ఈ సందర్భంగా జ్యోతి డ్రగ్స్ కేసు గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…