దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే… మే 17 తో లాక్ డౌన్ 3.0 ముగుస్తున్న సమయంలో మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కోరింది. అంటే మరో 14 రోజుల వరకు లాక్ డౌన్ చర్యలు పొంగించాలని రాష్ట్రాలను కోరింది.
అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు మే 31 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో మే 29 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా మే 31 వరకు పొడిగించాయి. అయితే లాక్ డౌన్ 4.0 కు సంబంధించి మినహాయింపులు, మార్గదర్శకాలను కేంద్ర హోమ్ శాఖ గైడ్ లైన్స్ జారీ చేయనుంది. లాక్ డౌన్ 4.0 లో మరికొన్ని కొత్త నియమాలు ఉంటాయని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…