లోబోగా ప్రసిద్ధి చెందిన మహమ్మద్ ఖయ్యూమ్.. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న యాంకర్ గా.. నటుడిగా అందరికీ తెలిసిందే. లోబో తన అసాధారణ డ్రెస్సింగ్ , మేకప్‌కు ప్రసిద్ధి చెందాడు. అంతే కాకుండా అనేక టీవీ షోలలో కనిపించాడు. నాగార్జున హోస్ట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 5 తెలుగు 19 మంది కంటెస్టెంట్‌లలో అతను కూడా ఒకడు .
అతను ప్రేక్షకులను డీసెంట్‌గా అలరించాడు.. హౌజ్ లో ఉన్నన్నీ రోజుల ప్రేక్షకులనూ బాగానే నవ్వించినా.. రియాలిటీ షో నుండి ముందుగానే బయటకు వచ్చాడు. అతడు కొన్ని సందర్భాల్లో తన భార్యను గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన భార్య గర్భవతి అని.. ఈ సమయంలో తాను ఆమె పక్కన ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక బయటకు వచ్చిన తర్వాత అతడు ఎక్కువగా బాధ పడలేదు. కానీ.. తన భార్య వద్దకు వెళ్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. లోబో భార్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.
లోబోకు మగబిడ్డ, ఆడపిల్ల జన్మించినట్లు.. అతడే ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. లోబో కొన్ని సినిమాల్లో నటించాడు. అతను నాని నటించిన పైసాలో కనిపించాడు.. ఈ సినిమాలో హీరో స్నేహితుల్లో ఒకరి పాత్రను పోషించాడు. లోబో హైదరాబాద్‌లో టాటూ పార్లర్‌ని నడిపిస్తున్నాడు. అంతే కాకుండా అతడు జీవనాధారంగా ఓ షాప్ ను కూడా నడిపిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లోబోకు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళా శంకర్ లో నటిస్తున్నాడు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…