Sreeleela: సినీనటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ధమాకా సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఏకంగా డజనుకు పైగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల సినిమాలలో కూడా ఈమె నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ప్రతి నెల వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి.
ఇప్పటికే ఆదికేశవ, భగవంత్ కేసరి, స్కంద, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాల ద్వారా శ్రీ లీల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ నాలుగు సినిమాలలో ఈమెకు భగవంత్ కేసరి మాత్రమే మంచి సక్సెస్ అందించిందని మిగిలిన మూడు సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని తెలుస్తుంది. ఇలా శ్రీలీలా నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా అందులో మూడు సినిమాలు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి.
ఇలా ఈ సినిమాలో డిజాస్టర్ కావడంతో నిర్మాతలు కూడా భారీగానే నష్టపోయారని తెలుస్తుంది. ఈమె నటించిన ఈ మూడు సినిమాలు కారణంగా దాదాపు 100 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని ట్రేడ్ పండితుల సమాచారం. ఇలా మూడు నెలల వ్యవధిలో నిర్మాతలకు 100కోట్ల నష్టాన్ని తీసుకువచ్చినటువంటి హీరోయిన్గా శ్రీ లీల చెత్త రికార్డు సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇలాంటి రికార్డు సొంతం చేసుకోలేదు.
గుంటూరు కారం…
ఈ విధంగా మూడు నెలల వ్యవధిలో 100 కోట్ల నష్టం అంటే మామూలు విషయం కాదు ఈమె ఈ సినిమాలు ఇలాగే కొనసాగితే శ్రీ లీల కెరియర్ పూర్తిగా ఇబ్బందులలో పడుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు అయితే ఈమె వచ్చే నెల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సక్సెస్ అవుతేనే ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీలో ఉండగలదని లేకపోతే తన సినీ కెరియర్ కష్టమే అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…