Featured

Lyricist Chandrabose : నేను రాసిన పాటల్లో నన్ను బాగా ఏడిపించిన పాట అదే…: సినీ పాటల రచయిత చంద్రబోస్

Lyricist Chandrabose : పాటల రచయితగా సుమారు 400 సినిమాలకు 3300 పాటలు రాసిన గేయ రచయిత చంద్రబోస్ గారు నేడు మరో కీర్తి కిరీటాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ కు చెందిన చంద్రబోస్ గారు చిన్నతనంలోనే పద్యాలు, రచనల మీద మక్కువతో బిటెక్ చదివే సమయంలో కవితలు రాసేవారు. అలా స్నేహితుల సహాయంతో మొదటి సారి శ్రీకాంత్ నటించిన ‘తాజ్ మహల్’ సినిమాలో మంచు కొండల్లోన చంద్రమా పాట రాసాడు. అది సూపర్ హిట్ అవడంతో అవకాశాలు బాగా వచ్చాయి. ఇక అలా పాటల రచయితగా ఎన్నో హిట్స్ అందుకున్న చంద్రబోస్ గారికి తాను రాసిన పాటల్లో బాగా కదిలించిన పాట ఏదో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

ఆ పాట కంటతడి పెట్టించింది…

ఎన్నో వేల పాటలను రాసిన చంద్రబోస్ గారికి ఆయన రాసిన పాటల్లో కదిలించిన కంటతడి పెట్టించిన పాట ఏంటనే ప్రశ్నకు చంద్రబోస్ మాట్లాడుతూ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో వచ్చే ఈ చేతితోనే బువ్వ పెట్టాను సాంగ్ రాసినపుడు బాగా ఎమోషనల్ అయ్యాను అని చెప్పారు. ఆ సినిమా అపుడు దుబాయ్ లో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పాటలు ఎలా ఉండాలి అని చర్చిస్తున్న సమయంలో సన్నివేశం చెప్పగానే డైరెక్టర్ బయటికి వెళ్లి వచ్చేలోపు పాటను రాసేసాను.

వెంటనే దేవిశ్రీ ట్యూన్ చెప్పడం పాట పాడి వినిపించడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక నేను పాట పాడినపుడు ఆ సాంగ్ ని దేవిశ్రీ రికార్డు చేసి డైరెక్టర్ సుకుమార్ కు వినిపించగా ఆ పాటను ఫైనల్ చేసారు. రికార్డు చేసిన పాటను విన్నపుడు కంట్లో నీళ్లు తిరిగాయని తెలిపారు చంద్రబోస్. ఇక అదే రికార్డింగ్ ను భార్య సుచిత్రకు పంపగా తాను కంటతడి పెట్టుకుంది అంటూ అది సినిమా అని తెలిసినా అందులో కల్పిత పాత్రకు రాసిన పాట అయినా కూడా పాట ఎంతో సహజంగా ఉంది అందుకే ఆ పాట విన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు అంటూ చంద్రబోస్ తెలిపారు.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

11 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

11 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

11 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

11 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

12 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

14 hours ago