Lyricist Jonnavithula : తెలుగు సినిమాకు సాహిత్యం అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్న జొన్నవిత్తుల గారు ఎన్నో ప్యారడి పాటలను రాశారు. ఇక సినిమాల్లో పాటలు రాయడమే కాకుండా తెలుగు భాషకు సేవ చేస్తున్నారు, అలా పద్యాలు రాస్తుంటారు. వివాదరహితంగా తన పని తాను చూసుకునే జొన్నవిత్తుల గారు మంచు విష్ణు సినిమా ‘దేనికైనా రెడీ’ విషయంలో వివాదాస్పదం అయ్యారు. బ్రాహ్మణులను కించపరిచారంటూ టీవీ డిబేట్లలో పాల్గొని వాదించడంతో బాగా వైరల్ అయ్యారు. ఇక ఈ విషయాలపై మరోసారి అసలు ఎందుకు ఆ వాదనాలోకి వెళ్ళవలసి వచ్చింది అనే విషయం చెప్పారు జొన్నవిత్తుల.
సినిమాలో ఆ డైలాగు విన్నాక కోపం వచ్చింది… దూరహంకారంతో మోహన్ బాబు అలా చేసాడు…
జొన్నవిత్తుల గారు మాట్లాడుతూ రచనలు ప్రింటింగ్ కి ఇవ్వగా అది ఇంకా ఆలస్యం అవడంతో ఆ సమయంలో ఏమి చేయాలి అని ఈ సినిమాలో ఏదో వివాదం జరుగుతోంది ఎందుకు అని దేనికైనా రెడీ సినిమా చూడటానికి వెళ్ళాను అంటూ చెప్పారు. ఒక చోట సినిమాలో సన్నివేశం చండి యాగం చేయాలి అంటూ ఒక వేద పండితుడిని పిలవగా రాను అంటాడు, వెంటనే డబ్బులు ఎక్కువ పడేస్తే తోక ఊపుకుంటూ వాళ్ళే వస్తారు అనే డైలాగు వస్తుంది. అక్కడ బాగా కోపం వచ్చింది బ్రాహ్మణలను అన్నాడని కాదు ఒక వేద పండితుడిని అలా ఎలా కించపరిచగలిగారు అనిపించింది.
అది అయ్యాక ఒక పండితుడి ఇంటికి వెళ్లగా ఆయన ఉండరు, ఆయన భార్య ఉంటుంది ఆమె తన భర్త నేపాల్ వెళ్ళాడు అని చెప్పి మీరు అచ్చం మా ఆయనలా ఉన్నారు అనడం, ఆమె లోపలికి వెళ్ళగానే ఈవిడ భర్తల ఉన్నానని నాతో తన భర్తతో చేసే పనులు చెయ్యదుగా అంటూ జోక్ చేయడం ఎంత చెండాలంగా ఉంది. ప్రపంచంలో ఏ భార్య అయినా ఇంకొక వ్యక్తిని నా భర్తలా ఉన్నాడు అంటుందా, అక్రమసంబంధం పెట్టుకోవాలని అనుకుంటే ఆమె భర్తలాగా ఉన్నవాడే ఎందుకు అక్కడ చాలా కోపం వచ్చింది. ఇక టీవీ ఛానెల్స్ వాళ్ళు పిలవడంతో డిబేట్ కి వెళ్ళాను అక్కడ నేను మాట్లాడినవాటికి నా తల పగులకొడతాం అంటూ అటువైపు వారు అన్నారు అంటూ చెప్పారు. ఇక కోర్ట్ లో పరువునష్టం దావా నా మీద వేసారు. ఐదేళ్ళు ఆ కేసు నడిచి తరువాత కోర్ట్ ఆ కేసును కొట్టేసారు. నేను మాట్లాడిన మాటలకు నాపై కేసు వేశారు. ఎంతోమంది పండితులు పిండాలు పెట్టారు, శాపాలు పెట్టారు, ఏమి చేయలేక ఇక కోర్ట్ వద్ద ఒక మహిళ చెప్పు విసిరింది వాళ్ళ మీద అవన్నీ పరువు నష్టం కాదా అంటూ చెప్పారు. మోహన్ బాబు కి ఎన్నో మంచి పాటలు రాసాను అతనితో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు, అతని అనుచరులు బాగా దాడికి దిగారు కానీ చివరకు ఐదేళ్ళు పోరాడాక కోర్ట్ నా మీద పెట్టిన కేసును కొట్టేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…