Taraka Ratna : ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయమైన ఎన్టీఆర్ కుమారుడు మోహన కృష్ణ తనయుడు తారక రత్న ఒకేసారి తొమ్మిది సినిమాలను ఒప్పుకుని అప్పట్లో రికార్డు సృష్టించాడు. అయితే మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ పర్వాలేదనిపించినా మిగిలిన సినిమాలు ఎపుడు వచ్చాయో ఎపుడు పోయాయో కూడా తెలియ్యకుండా వెళ్లిపోయాయి. ఇక సినిమాలను తగ్గించిన తారక రత్న మధ్యలో ఒకసారి రవిబాబు సినిమా ‘అమరావతి’లో విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఇక మళ్ళీ చాలా రోజులకు వెబ్ సిరీస్ తో అలరించిన తారక రత్న ఈసారి సినిమాతో కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి స్పీచులతో ఆకట్టుకున్నాడు. అయితే కుప్పంలో తాజాగా లోకేష్ తో కలిసి పాదయాత్రలో కలిసి వెళ్తోండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బెంగళూరు తరలించగా గుండె పనిచేయడం ఆగిపోవడంతో ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్ల తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తారక రత్న తన కుటుంబం గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ తో గొడవలు… నందమూరి ఫ్యామిలీ దురదృష్టం…
తారక రత్న సినిమాలకు దూరమై చాలా కాలమైనా మళ్ళీ వెబ్ సిరీస్ తో చాలా కాలం తరువాత మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో యాక్టీవ్ పాలిటిక్స్ లో ఉండాలని భావించి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక తన కుటుంబం గురించి అంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడారు తారక రత్న. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పిన తారక రత్న తమ్ముడు ఎన్టీఆర్ కి పోటీగా సినిమాల్లోకి రావడం గురించి క్లారిటీ ఇచ్చాడు. తనకు నేను పోటీ కాదని, తన టాలెంట్ వేరే లెవెల్ అంటూ చెప్పారు. తండ్రి మోహన్ కృష్ణ తారక రత్నను దూరం పెట్టారు అనే వార్తలకు క్లారిటీ ఇస్తూ అలాంటిదేమీ లేదని కలిసే ఉన్నామని చెప్పారు.
ఇక కుటుంబం అంతా కలిసే ఉంటామని అయినా బయట మీడియాలో ప్రచారం అయ్యే విషయాలకు స్పందించక పోవడం వల్ల అది నిజం అనుకుంటారు. సోషల్ మీడియా వల్ల ఏది నిజమో ఏది ఆపద్ధమో తెలియకుండా పోతోంది అంటూ చెప్పారు. ఇక హరికృష్ణ గారు, జానకి రామ్ గారు మరణించడం కుటుంబానికి తీరని లోటని, అది నందమూరి ఫ్యామిలీ దురదృష్టం అంటూ చెప్పారు. మీడియాలో ఎన్టీఆర్ తన కుటుంబానికి 3000 కోట్ల ఆస్తి ఇచ్చాడంటూ కథనాల గురించి మాట్లాడుతూ అలాంటిదేమి లేదని, ఆయన లేగసీ మాకు ఇచ్చారు అదే గొప్ప విషయం, ఇక ఆస్తులు ఎన్ని ఎక్కడ ఉన్నాయని ఇప్పటికీ నాన్నని వెళ్లి అడిగే అంత లేదు, అవసరమూ లేదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…