Categories: FeaturedMovie News

M. M. Keeravani : ఒక్క ట్వీట్ తో నెగెటివిటీ మూట గట్టుకున్న కీరవాణి.. డిలీట్ చేసినా వదలడం లేదుగా…!

M. M. Keeravani : ఈ సోషల్ మీడియా జమానాలో ఏదైనా తేడా మాట్లాడితే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అది ఒక సెలబ్రిటీ ఏదైనా తేడాగా ఒక పోస్ట్ చేసినా చాలు ఇక అది ఫుల్ గా వైరల్ అయిపోయి జరగాల్సిన డామేజ్ మొత్తం జరిగిపోతుంది. ఆ తరువాత వాళ్ళు పెట్టిన దానికి, మాట్లాడిన దానికి వివరణ ఇచ్చినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోతుంది. కొన్నేళ్లుగా సంపాదించుకున్న ఇమేజ్ ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తో ఉన్న ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకుంటారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు.

బూతు అర్థం వచ్చేలా ట్వీట్ చేసి మళ్ళీ డిలీట్…

ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి వాఖ్యలు చాలా మందికి నచ్చలేదు. మనీష్ భరద్వాజ్ అనే సినిమా దర్శకుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని 30 నిమిషాల చెత్త చూసాను అంటూ ట్వీట్ చేయడం, దానికి ఆస్కార్ విన్నర్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆర్ఆర్ఆర్ సినిమాను గే సినిమాగా వర్ణించడంతో వివాదం మొదలైంది. ఈ ట్వీట్ కి వెంటనే బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రిప్లై ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ నాకు గే సినిమాలా అనిపించలేదు, ఒకవేళ నువ్వన్నట్లు అది గే సినిమా అయినా అందులో తప్పేంటి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇక రసూల్ పూకుట్టి ఈ కామెంట్ కు స్పందిస్తూ పబ్లిక్ డోమైన్ లో ఉన్న విషయాన్ని సరదాగా చెప్పాను అని వివరణ ఇచ్చారు. ఇక అక్కడితో వివాదం సద్ధుమనగలేదు.

ఇక రసూల్ పూకుట్టి ట్వీట్ కి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రిప్లై ఇచ్చారు. ఇంగ్లిష్ టైపింగ్ నాకు సరిగా రాదు, అప్పర్ కేస్, లోయర్ కేస్ వాడటం సరిగా రాదంటూ రసూల్ పూకుట్టి పేరును అప్పర్ లోయర్ కేస్ లను మిశ్రమంగా వాడుతూ బూతు మాట వచ్చేలా రాసారు. ఇది చాలా మంది నెటిజన్స్ కి అర్థమైంది దాంతో కీరవాణి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతవరకూ రసూల్ పూకుట్టి మీద ఉన్న నెగెటివిటీ కీరవాణి తన మీదకు విజయవంతంగా తెచ్చుకున్నాడు. ఇక ఇంతటి వ్యక్తి అలా బూతులు మాట్లాడటం ఏమిటి అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మరి కొంతమంది మాత్రం తెలుగు సినిమాను కావాలనే తగ్గిస్తున్న అలాంటి వారిని ఇలా అనడంలో తప్పు లేదంటూ కీరవాణిని సమర్థిస్తున్నారు. ఇక ట్రోల్స్ మొదలవడంతో కీరవాణి ఆ ట్వీట్ ను డిలీట్ చేసారు. మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టారు. టైపింగ్ లోపం పోయి కొత్తగా క్యారెక్టర్ బ్లైండ్ నెస్ వచ్చిందని సినిమాలో రామ్, భీమ్ క్యారెక్టర్లు కనిపించడం లేదని కేవలం దేశ భక్తుడైన అజయ్ దేవగన్ పాత్ర బాగా నచ్చిందంటూ వ్యంగ్యంగా గే కథ ట్వీట్ కు స్పందించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago