Featured

Samantha : సమంత ఇన్ స్టాగ్రామ్ లో కేటీఆర్ ఫోటో ప్రత్యక్షం… ఆ విషయంలో ఇద్దరూ సేమ్ టు సేమ్..!

Samantha : ప్రస్తుతం సమంత సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా రేంజలో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది సమంత. తాజాగా సమంత యశోద, శాకుంతలం, విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలు చేస్తోంది. అయితే యశోద, శాకుంతలం సినిమాలకు సంబందించిన విడుదల తేదీలు ఇంకా తెలియాల్సి వుంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమంత ఎపుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటుంది. అయితే తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో కేటీఆర్ ఫోటో ప్రత్యక్షమైంది.

సమంత ఎందుకు ఈ పోస్ట్ చేసింది…

సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఎందుకు కేటీఆర్ ఫోటో ప్రత్యక్షం అయ్యిందో అభిమానులకు అర్థం కాలేదు. అయితే దీనికి కారణం ఏంటంటే పీఆర్ టీమ్, అవును పీఆర్ టీమ్ పొరపాటు వళ్ల ఇది జరిగింది. ఎలా అంటే… చాలామంది సెలబ్రిటీలు ఇంకా రాజకీయ నాయకులు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబందించిన ఫోటోలను, ఇతర విషయాలను షేర్ చేస్తూ ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. వారి తరపున పీఆర్ టీమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటారు. అయితే ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే కొంతమంది సెలబ్రిటీలకు కామన్ గా ఒకే పీఆర్ ఏజెన్సీ ఉండటం. కాకపోతే ఈ విషయాలు బయటకు తెలియవు. తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో కేటీఆర్ ఫోటో ఇలానే ప్రత్యక్షమైంది. ఫోటో ఒకటే కాదు ఫోటో తో పాటు “నా ప్రజలే నా బలం నా ధైర్యం నా నమ్మకం!” అని ఉంది.

అయితే కొన్ని నిమిషాలకే సమంత ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ పోస్ట్ తీసివేయడం జరిగింది. పీఆర్ ఏజెన్సీ కేటీఆర్ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయాల్సిన దానిని అందుకు బదులుగా సమంత అకౌంట్ నుంచి పోస్ట్ చేసినట్టు అందరికీ అర్థం అయిపోయింది. తరువాత ఏజెన్సీ నిర్వాహకులు తప్పును సరిదిద్దే ప్రయత్నం కూడా చేశారు. అయితే మొత్తానికి ఇలా జరగడం వల్ల కేటీఆర్, సమంత పీఆర్ టీమ్ ఒకటేనని అందరికీ క్లారిటీ వచ్చింది.

Bhargavi

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

4 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

4 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

4 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

4 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

4 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

4 hours ago