Maanas Nagulapalli : మా టీవీ లో వచ్చే ‘కోయిలమ్మ’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల వద్ధ గుర్తింపు తెచ్చుకున్న మానస్ ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచిన మానస్ ఇటీవలే ఒక ప్రైవేట్ పాటతో మరోసారి వైరల్ అయ్యాడు. మానస్ సొంతూరు వైజాగ్ కానీ పెరిగింది, చదువుకుంది హైదరాబాద్ లో. ఇక చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన మానస్ ఆ తరువాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు కానీ సీరియల్ ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మారుతీ ఈ రోజుల్లో ఆఫర్ నేనే వదులుకున్నా…
నరసింహా నాయుడు, అర్జున్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మానస్ నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే డైరెక్టర్ మారుతీ తన సినిమాలో హీరోగా చేయమని అడిగితే ఆ ఆఫర్ వదులుకున్నానని మానస్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. మొదటి సారిగా మారుతీ 5 డి టెక్నాలజీ సహాయంతో సినిమా చేయబోతున్నట్లు చెబితే ఇది ఎలా వర్క్ అవుట్ అవుతుంది అనుకుని అలోచించి వద్దనుకున్నా కానీ ‘ఈరోజుల్లో’ సినిమా పెద్ద హిట్ అయింది. అప్పట్లో ఒక బెంచ్ మార్క్ సినిమా గా మారింది. అప్పుడు తప్పు నాదే పరిణితి లేని వయసులో డెసిషన్, అది సినిమా వాళ్ళు ఎలా తీస్తారు, ఏ ఫార్మాట్ లో తీస్తారు అన్నవి ఎందుకు ఆలోచించాను అనిపించింది.
కానీ మళ్ళీ ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ సినిమాలో ఆఫర్ కూడా అలాగే వదులుకున్నా. ఇక ఇండస్ట్రీలో బాలకృష్ణ, మహేష్ బాబు తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసాను కాబట్టి వాళ్లను కలవాలి నా కెరీర్ కి ఉపయోగ పడుతుందని ఎపుడూ అనుకోలేదు, అవకాశం ఉన్నా అలా చేయలేదు. ఇక బి గోపాల్ గారు పరిచయమున్నా అలా కలిసి సినిమా అవకాశాలు అడగలేదు. వచ్చిన ఆఫర్స్ చేసుకుపోవడమే కానీ ఒకరిని కలిసి పరిచయాలు పెంచుకోవాలనే ఆలోచన ఎపుడూ లేదు అంటూ చెప్పాడు మానస్ నాగులపల్లి.
హిందూ దేవాలయ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ధ్వజస్తంభం ఏర్పాటు. ఏ ఆలయానికి…
జ్యోతిష్య విశ్వాసాల్లో శని Dev ప్రత్యేక స్థానం కలిగిన దేవతగా భావిస్తారు. కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవుడిగా ఆయనను…
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానం కలిగిన Srisailam Temple క్షేత్రానికి భక్తుల రాకపోకలు ఎప్పుడూ కొనసాగుతూనే…
తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు…
వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్‌డ్రింక్స్ తాత్కాలికంగా చల్లదనం…
తెలుగు వంటల్లో పాతకాలపు రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాల ఫుడ్ అలవాట్లు పెరిగినా,…