Movie News

Madhavan Son Vedaant: మరో రికార్డు సృష్టించిన మాధవన్ కుమారుడు… ఇండియాకు ఏకంగా 5 గోల్డ్ మెడల్స్!

Madhavan Son Vedaant:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు వారి పిల్లలను కూడా వారసత్వంగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే వారి పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ ఉన్నారు.ఇకపోతే చాలామంది పిల్లల ఇష్ట ఇష్టాలను గౌరవించే వారికి నచ్చిన రంగంలోనే వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే నటుడు మాధవన్.

ఈయన హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ తన కుమారుడు వేదాంత్ కు మాత్రం నటనపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని తెలుస్తుంది.ఇలా నటనపై ఆసక్తి లేకపోవడంతో మాధవన్ తనకు ఇష్టమైన రంగంలో తన కొడుకును ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టం కావడంతో ఇప్పటికే ఎన్నో స్విమ్మింగ్ పోటీలలో ఎన్నో పథకాలను సాధించి ఇండియా పేరు ప్రతిష్టలను నిలిపారు.

ఈ క్రమంలోనే తాజాగా మలేషియాలో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో ఏకంగా 5 గోల్డ్ మెడల్స్ సాధించారు. 50, 100, 200, 400, 1500 మీటర్ల విభాగంలో వేధాంత్ సత్తా చాటి ఇండియా తరఫున బంగారు పతకాలు సాధించాడు.ఇక తన కొడుకు సాధించిన ఈ అద్భుతమైన విజయం గురించి స్వయంగా మాధవన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.

Madhavan Son Vedaant: పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మాధవన్…

ఈ విధంగా మాధవన్ కుమారుడు వేదాంత్ ఇదివరకే స్విమ్మింగ్ పోటీలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున ఇండియాకు అవార్డులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎంతోమంది సెలబ్రెటీల పిల్లలు పబ్బులు పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుండగా వేదాంత్ మాత్రం ఇండియా పేరు ప్రతిష్టలను నిలబెడుతున్నారు అంటూ కొందరు ఈయన సాధించిన విజయం పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago