Featured

Paruchuri Gopalakrishna : ఆరోజు సురేష్ బాబు చెప్పిన మాటలు విని ఉంటే ఈరోజు నేను…: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopalakrishna : పరుచూరి బ్రదర్స్ అనగానే రచయితలుగా వారు అందించిన సినిమాలు గుర్తు వస్తాయి. రచయితలుగానే కాకుండా డైలాగ్ రైటర్స్ గా, నటులుగా వారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమదైన చెరగని ముద్ర వేసుకున్నారు. అనురాగ దేవత సినిమాతో మొదలైన వీరి సినీ ప్రస్థానం సైరా నరసింహారెడ్డి వరకు కొనసాగింది. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంభాషణలను అందించిన పరుచూరి బ్రదర్స్ మాస్ డైలాగులకు ఫేమస్. ప్రస్తుతం సినిమాలకు పెద్దగా పనిచేయడం లేదు వారు, అందులో పరుచూరి గోపాలకృష్ణ గారు మాత్రం యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎంతో మంది సినిమా డైరెక్టర్స్ కావాలనుకుంటున్న వారికి గైడన్స్ ఇస్తుంటారు. ఇక పరుచూరి బ్రదర్స్ డైరెక్షన్ లో వచ్చినవి కొన్ని సినిమాలైనా మంచి హిట్లందుకున్నాయి.

సురేష్ బాబు చెప్పిన మాట వినుంటే ఈరోజు వేరేలా ఉండేది…

పరుచూరి బ్రదర్స్ శోభన్ బాబు గారు నటించిన సర్పయాగం సినిమాను డైరెక్ట్ చేసారు. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని సురేష్ బాబు గారిలాంటి వారు ముందే చెప్పేశారట. అంతకుముందు తీసిన ప్రజాస్వామ్యం సినిమా కూడా బాగా హిట్ అవడంతో పరుచూరి బ్రదర్స్ కి బాగా పేరు వచ్చింది. ఇక సర్పయాగం సినిమా అయ్యాక కూడా సినిమా డైరెక్షన్ చేయమని అశ్వినిదత్, రాఘవేంద్ర రావు, దేవి వర ప్రసాద్ ముగ్గురూ చాలా అమౌంట్ ఆఫర్ చేసి మరీ సినిమా చేయమని చెప్పారు. ఇక సురేష్ బాబు గారు అడ్వాన్స్ తీసుకోండి శంకరం పల్లి వద్ద నేను స్థలం తీసుకుంటున్నాను మీ డబ్బు ఇస్తే మీకు తల 50 ఎకరాలు చొప్పున 100 ఎకరాలు తీసుకోండి బిడ్డలకు భవిష్యత్ లో పనికొస్తుంది అని చెప్పారట.

అయితే పరుచూరి వెంకటేశ్వరరావు గారు నా తమ్ముడు డైరెక్టర్ అయితే నేనేం చేయాలి ఫిడేల్ వాయించాలా అని వ్యతిరేకించే సరికి మా అన్నకి ఇష్టం లేకుండా వద్దని వదిలేసాను. అలా ఆరోజు శంకర పల్లిలో 100 ఎకరాలు కొనుంటే మేము కోటీశ్వరులం అయ్యేవాళ్ళం. అపుడు ఆలోచనలు వేరు, రైటర్ గా ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంటుంది అనుకున్నాం, కొద్ది కాలానికి అన్నయ్య చాలా బాధపడ్డాడు. ఆరోజు నిన్ను డైరెక్టర్ అయ్యేందుకు ఒప్పుకునుంటే వేరేలా మన కెరీర్ ఉండేది అని బాధపడ్డారు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago