Featured

Madhavi Latha : నాగార్జునపై బొక్కేం కాదు… అంటూ కామెంట్ చేసిన మాధవి లత..!

Madhavi Latha : నచ్చావులే సినిమాతో తెలుగు తెరపై గుర్తింపు తెచ్చుకున్న మాధవి లత సినిమాల్లో ఎక్కువగా సక్సెస్ కాలేదు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఎపుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇక రాజకీయ ప్రవేశం చేసి సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ పెడుతూ వైరల్ అవుతుంటుంది మాధవి.

బిగ్ బాస్ గురించి కామెంట్స్….

ఇక బిగ్ బాస్ రియాలిటీ షో గురించి నిత్యం ఏదో ఒక కామెంట్ పెట్టే మాధవి లత గత సీజన్ లో సన్నీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఇక ఈ సారి ఏకంగా హోస్ట్ నాగార్జున మీదే కామెంట్స్ చేసి వైరల్ అవుతోంది. బిగ్ బాస్ నానస్టాప్ సీజన్6 చివరి దశకు వచ్చింది. కాంటెస్టెంట్ల మధ్య హోరాహోరిగా ఉంది. ఇక ఇటీవల నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వకముందు నటరాజ్ మాస్టర్ కి బిందు మాధవికి జరిగిన ప్రాంతీయ వివాదం గురించి నాగార్జున నటరాజ్ మాస్టర్ కు చురకలేయడం గురించి మాధవి లత ఫైర్ అయింది.

బిందు మాధవి తెలుగమ్మాయి అయినా తమిళ పరిశ్రమలో పని చేసింది ఇపుడు బిగ్ బాస్ అనగానే ఇక్కడకు వచ్చింది మళ్ళీ ఆఫర్స్ రాగానే తమిళనాడుకి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడే 23 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నా అసలు తెలుగు వాడిని నేను అంటూ నటరాజ్ మాస్టర్ మాట్లాడారు. ఇక ఈ విషయం గురించి నాగార్జున నటరాజ్ మాస్టర్ కి క్లాస్ పీకారు వన్ ఇండస్ట్రీ వన్ కంట్రీ అంటూ చెప్పారు. ఇక ఈ విషయం పైనే ఇపుడు మాధవి లత సోషల్ మీడియా వేదికగా వరుస కామెంట్స్ పెట్టింది .

నాగార్జున పై ఫైర్ అయింది. వన్ కంట్రీ.. వన్ ఇండస్ట్రీనా, బొక్కేం కాదు. ఇక్కడ ఇదే ఇండస్ట్రీలో టాలెంట్ కి అవకాశం లేదు తమిళనాడుకి వెళ్లామన్నారు వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు మా నాగ్ మామ. అరే! పాపం నటరాజ్ మాస్టర్ గేమ్ ని గేమే అనుకున్నాడే కానీ.. బిగ్ బాస్ హౌస్‌లో మాస్క్ వేసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోయాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నానని గత నాలుగేళ్లుగా నన్ను కామెంట్ చేస్తున్నారు . రూ.10 కోట్లు ఇచ్చినా నేను బిగ్ బాస్ హౌస్‌కి పోను.. పోలేను అంటూ మాధవి లత ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago