Geetha Krishna : కోట శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పలువురి హీరోల గురించి చేసే కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం హాస్పిటల్ కట్టిస్తానని చెప్పడంతో ఆయన ఆ విషయం పై విమర్శలు చేశారు. అదేవిధంగా మెగాస్టార్ తనయుడిగా చరణ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని ఆయనలో పెద్దగా నటుడు లేడు అంటూ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు మెగా కుటుంబం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు తమదైన శైలిలో వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇకపోతే డైరెక్టర్ గీతాకృష్ణ ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి హాస్పిటల్ కట్టడం నచ్చని కోట, చిరంజీవి ఏ పని చేస్తే బాగుంటుందో చెబితే సరిపోయేది. అలా కాకుండా అతని మనసులో ఏదో పెట్టుకుని బయటకు ఇలా మాట్లాడటం చాలా తప్పు. ఇక షూటింగ్ సమయంలో కోట శ్రీనివాసరావు అసిస్టెంట్ డైరెక్టర్లతో బాగా గొడవ పెట్టుకునే వారని అలా ఒక సినిమా విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్ ని తిడితే నేనే వార్నింగ్ ఇచ్చాను అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఉగాది సినిమాని సమాధి అంటూ ఈయన డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దగ్గర ప్రస్తావించారట. కోట శ్రీనివాసరావు మంచి నటుడే అయినప్పటికీ స్త్రీలను ఆయన చాలా నీచంగా చూస్తారని, అందుకే అతనిని నీచుడు అంటారని గీతా కృష్ణ కామెంట్ చేశారు. కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మంచిది కాదు అంటూ ఆయన తెలిపారు. ఇక రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పు.ఇలా చరణ్ కు నటన రాదు అని మాట్లాడితే ఇతను అవకాశాలు ఎవరిస్తారు. కెమెరా ముందు నిలబడి నటించే ప్రతి ఒక్కరూ శ్రామికుడేనని కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ గీతాకృష్ణ స్పందించారు. ప్రస్తుతం ఈయన కోట గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…