Balakrishna : సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు టాప్ హీరోస్ గా నాలుగు దశబ్దాలుగా ఉన్నారు. ఇక చిరంజీవి, బాలకృష్ణ ల మధ్య సినిమా పోరు మాత్రం చాలా రసవత్తరంగా ఉండేది. అన్నయ్య – వంశోద్ధారకుడు, సమర సింహా రెడ్డి – స్నేహం కోసం, నరసింహా నాయుడు – మృగరాజు ఇక ఇటీవల ఖైదీ నెంబర్ 150 – గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడి హీట్ పెంచాయి. ఇక హీరోలు ఇలా ఉన్నా అభిమానుల మధ్య మాత్రం పోటీ బాగా ఉండేది.
చిరు ఇంట బాలయ్యబాబు సినిమా షూటింగ్…..
ఇక అలాంటి హీరోల మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. చాలా మందికి తెలియని ఈ విషయం ఏంటంటే చిరంజీవి కి సంబంధించిన ఇంట్లో బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుపుకుంది ఇక ఆ సినిమా కూడా పెద్ద హిట్ సినిమా. మరి ఆ సినిమా ఏంటో తెలుసా బాలకృష్ణ, శోభన, నిరోషా కలిసి నటించిన నారి నారి నడుమ మురారి సినిమా. ఒక్క ఫైట్ లేకుండా హిట్ అయిన బాలకృష్ణ సినిమాగా నిలిచిన ఈ సినిమా కొంత భాగం షూటింగ్ తమిళనాడులోని వేలచ్చేరి ప్రాంతంలో, చిరంజీవికి ఉన్న అతిధి గృహంలో కొంత భాగం సినిమా షూట్ చేశారు.
ఇక ఈ ఇంటి పేరు హనీ హౌస్, దానిపక్కనే 2 ఎకరాల భూమి కూడా చిరంజీవికి ఉంది. ఈ సినిమాలో హీరో బాలయ్య పాత్ర పూరి గుడిసె కూడా చిరంజీవికి చెందిన స్థలంలోనే నిర్మించారు. కొన్ని సన్నివేశాలకోసం కూడా హనీ హౌస్ లో షూట్ చేశారు. ఈ సినిమా 1990 లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో మరో విశేషం సినిమా చివరి సీన్స్ లో దాదాపు 20 నిముషాలు హీరో పాత్ర కనిపించదు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం కోదండ రామిరెడ్డి గారు నిర్వహించారు. కోదండ రామి రెడ్డి, చిరు కాంబినేషన్ హిట్ కాంబినేషన్ 23 సినిమాలు వారి కాంబినేషన్ లో వచ్చాయి. ఆ చనువుతోనే బాలకృష్ణ సినిమా కోసం చిరంజీవి గెస్ట్ హౌస్ ను షూటింగ్ కోసం వాడారట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…