Prabhas: ప్రభాస్ ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరు. బాహుబలి వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ అందరికీ సుపరిచితమే.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోని ఒక్కసారైనా కలవాలని, అతనితో మాట్లాడాలని ఎంతో మంది భావిస్తారు. ఈ క్రమంలోనే ఇలా స్టార్ హీరోల పేర్లు చెప్పుకొని ఎంతోమంది పెద్దఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు.ఇలా ప్రభాస్ పేరు చెప్పుకొని టాలీవుడ్ హీరోయిన్ ట్రాప్ చేయడానికి ప్రయత్నించారట. టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన రేఖా భోజ్ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు జరిగిన సంఘటనల గురించి కామెంట్ రూపంలో తెలియజేశారు.
2016వ సంవత్సరంలో ప్రభాస్ అసిస్టెంట్ అనే ఒక వ్యక్తి తనకు ఫోన్ చేశారని ఈమె తెలియజేశారు. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ మీరు ప్రభాస్ అభిమాని తనకు మెసేజ్ చేయడం వల్ల అతను మిమ్మల్ని కలవడం కోసం నోవాటెల్ హోటల్ లో ఎదురు చూస్తున్నారనీ చెప్పినట్లు ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.
ఈ విధంగా తనకు ఫోన్ చేసి తాను ప్రభాస్ అసిస్టెంట్ ప్రభాస్ నా కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పడంతో ఒక్కసారిగా నేను పగలబడి నవ్వి ఆ వ్యక్తిని ఇష్టానుసారంగా తిట్టి ఫోన్ పెట్టేసానని తెలిపారు. అయితే ఇలాంటి ఫోన్ రావడానికి రెండు రోజుల ముందే కమెడియన్ ప్రభాస్ శీను ప్రభాస్ అమెరికా వెళ్ళాడని మరో ఆరు నెలల వరకు ఇండియా తిరిగి రారని చెప్పారు. ఈ విధంగా అమెరికా వెళ్ళిన ప్రభాస్ నన్ను ఏ విధంగా కలుస్తారని అతనిని తిట్టానట్లు ఈమె తెలిపారు.ఈ విధంగా రోజు సెలబ్రిటీల పేర్లు చెప్పుకొని ఎంతమంది ఎన్ని మోసాలకు పాల్పడుతున్నారో అంటూ రేఖా భోజ్ తన విషయంలో జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…