Categories: FeaturedMovie News

Madhu Siva Balaji : మా లవ్ స్టోరీ… ఫస్ట్ కిస్ ఎప్పుడంటే… ఎలా ఫ్లర్ట్ చేసానంటే… ఆరోజు ఏడవడానికి కారణం అదే..: మధు శివబాలాజీ

Madhu Sivabalaji : ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ బాలాజీ ఆ తరువాత ఎలా చెప్పను, దోస్త్ సినిమాల్లో నటించారు. అయితే శివ బాలాజీ కి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం ‘ఆర్య’. బన్నీ నటించిన ఆర్య సినిమాల్లో విలన్ షేడ్ ఉన్న పాత్రలో అజయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత ‘సంక్రాంతి’ సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న శివ బాలాజీ తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్లకే సొంత వ్యాపార సంస్థలను పెట్టాడు. ఇక సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చిన శివ బాలాజీ నటి మధుమిత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వారి లవ్ స్టోరీ, వైవాహిక జీవితం గురించిన ముచ్చట్లను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మధు శివబాలాజీ పంచుకున్నారు.

ఫస్ట్ కిస్ ఎప్పుడంటే… ఆరోజు బాగా ఏడ్చాను…

మధు్మిత కూడా తెలుగు, తమిళం భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన మధుమిత అంతకుముందు ‘అల్లరి’ సినిమాతో ఆకట్టుకుంది. ఇక శివ బాలాజీ తో కలిసి ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో నటించిన సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సినిమా సమయంలో మధుమితతో మాట్లాడటానికి ఎంతో ట్రై చేస్తూ అవకాశం దొరికితే ఫ్లర్ట్ చెసేవాడట శివ బాలాజీ. ఇక అలా ప్రేమించుకున్న ఈ జంట మొదటి కిస్ కూడా ఆ సినిమా సమయంలో సీన్ లో భాగంగా ఇద్దరూ లేచిపోవాలని ఇంటి నుండి పారిపోయే సమయంలో సీన్ లో లేకపోయినా శివ బాలాజీ కిస్ చేశాడట.

అలా మొదలైన వీరి ప్రేమలో పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ అయిన శివ బాలాజీ గెలుపులో మధుమిత పాత్ర ఎంతో ఉంది. సోషల్ మీడియాలో తన భర్త గెలుపుకోసం బాగా కష్టపడ్డారు. ఆ షోలో ఫ్యామిలీని కలిసే ఎపిసోడ్ లో మధు మిత బాగా ఏడ్చారు. ఇప్పటికీ ఆ సమయంలో ప్లే చేసిన ‘నీ సెలవడిగి నే కదిలేళ్తున్న నా కలలన్ని’ సాంగ్ వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయాంటూ తెలిపారు మధుమిత. తనతో పరిచయమైన తరువాత ఎపుడు అన్ని రోజులు మాట్లాడకుండా లేను, అలా ఉండేసరికి బాగా ఏడ్చేసాను అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago