Maha Shivaratri @144 years : హిందువుల పవిత్రమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఆ ముక్కంటికి ఆరోజున పూజలు చేస్తే చేసిన పాపాలు తొలగడమే కాకుండా మంచి జరుగుతుందని హిందువుల నమ్మకం. హిందువుల క్యాలెండర్ కొన్ని ప్రాంతాల్లో మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున, మరికొన్ని ప్రాంతంలో ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి రోజున శివరాత్రి జరుపుకుంటారు. మహా శివరాత్రి రోజున శివుడు ఒక మహాలింగ రూపంలో ఉద్భవించాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఇంత పవిత్రమైన రోజున ఈశ్వరుడి దర్శనం తప్పక చేసుకోవాలి అంటున్నారు పండితులు. ముఖ్యంగా రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. ఈసారి ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం మహా శివరాత్రి ఫిబ్రవరి 18న శనివారం వచ్చింది. అయితే ఈసారి శివరాత్రికి అనేక విశిష్టతలు ఉన్నాయి.
ఎన్నో జన్మల పుణ్యం ఈ శివరాత్రి పర్వదినం…
ఈసారి మహా శివరాత్రి ప్రతి ఏడాది వచ్చే శివరాత్రి లాంటిది కాదు అంటూ పండితులు చెబుతున్నారు. పన్నెండు పుష్కరాలకు ఒకసారి వచ్చే శివరాత్రి ఈ సారి రానుందని, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ శివరాత్రి కి శివయ్య దర్శన భాగ్యం కలుగుతుందంటూ చెబుతున్నారు. ఈ సారి శివరాత్రి శనివారం నాడు అది కూడా శని త్రయోదశి రెండూ కలిసి రావడం మరో విశేషం. ఇక శివరాత్రి ఈ సారి ఉత్తరషాడ నక్షత్రం అలాగే శ్రవణ నక్షత్రం లలో శివరాత్రి రాబోతుందడం మరో విశేషం.
ఉత్తరషాడ నక్షత్రం కు అధిపతి రవి కాగా, శ్రావణ నక్షత్రం కు అధిపతి చంద్రుడు అవడం వల్ల శివరాత్రి రోజున శివయ్యకు ఆరాధన చేస్తే మానసిక సమస్యలు అలాగే మానసిక ఆందోళన, అనారోగ్య సమస్యలు దూరమవుతయంటూ పండితులు సూచిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినంనాడు కనీసం శివలింగం దర్శనం చేసుకున్నా మంచి ఫలితం ఉంటుందని మళ్ళీ 144 ఏళ్లకు గాని ఎలాంటి శివరాత్రి మళ్ళీ రాదంటూ చెప్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…