Mahalakshmi: మహాలక్ష్మి రవీందర్ చంద్ర శేఖరన్ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవీందర్ బుల్లితెర నటి మహా లక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది రెండవ వివాహం కావడం విశేషం. ఇలా వీరిద్దరి వివాహం జరిగి రెండేళ్లు పూర్తి అయినప్పటికీ ఈ జంట గురించి భారీగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.
మహాలక్ష్మి రవీందర్ పెళ్లి చేసుకున్నారని తెలియడంతో చాలామంది మహాలక్ష్మి పై విమర్శలు చేశారు. ఈమె కేవలం రవీందర్ డబ్బు చూసితనని పెళ్లి చేసుకున్నారంటూ విమర్శలు చేశారు. ఇక రవీందర్ సైతం భారీ శరీరకాయంతో ఉండటం వల్ల ఆయన పై బాడీ షేమింగ్ ట్రోల్స్ వచ్చాయి. అయితే వీటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
ఇకపోతే ఒకానొక సమయంలో వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి ఆ వార్తలను ఈ దంపతులు తీవ్రంగా ఖండించారు. ఇకపోతే రవీందర్ పుట్టినరోజు సందర్భంగా ఈమె తన భర్తకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ చెప్పడమే కాకుండా తనకు సర్ప్రైజ్ ఇస్తూ ఏకంగా ఆరడుగుల బహుమతి అందజేశారు. మరి ఈమె ఇచ్చిన ఆరు అడుగుల బహుమతి ఏంటి అనే విషయానికి వస్తే…
తన భర్త ఫోటో ప్రేమ్ ఆరడుగుల చేయించి ఈమె కానుకగా ఇచ్చారు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా మళ్లీ నా జీవితంలో నాకు ధైర్యం నింపిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వే నా బలం అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞరాలిని అంటూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…