కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.ఇలాంటి సమయంలో మన దేశంలోని మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.పోలీస్ అధికారి సంతోష్ గైక్వాడ్ ఈ ఘటనను ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.
మహారాష్ట్ర బారామతి జిల్లాలోని ముధలే గ్రామా నివాసి 76 ఏళ్ల బామ్మ శంకుత గైక్వాడ్ కు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడగా కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఆబామ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో మే 10వ తేదీన ఓ ప్రైవేట్ వాహనంలో శంకుత గైక్వాడ్ ను బారామతి లోని ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమయ్యారు.
అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా ఆస్పత్రిలో బెడ్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. చేసేదేమీ లేక వారు కారులో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో శకుంతల పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కదలం కూడా ఆపేసింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయడానికి తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు.
తమ ఊరిలో అంత్యక్రియలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత అంతిమ యాత్రలో భాగంగా బామ్మను పాడెపై పడుకో పెడుతుండగా బామ్మ ఉలిక్కిపడి లేచి ఏడవటంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఊరి జనం ఒక్కసారిగా ఆశ్చర్యానికిలోనయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకున్న కుటుంబ సభ్యులు బామ్మను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బామ్మ బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…