General News

అంతిమయాత్రకు తీసుకెళ్తుండగా లేచిన బామ్మ.. షాక్ లో కుటుంబ సభ్యులు.. చివరికి?

కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.ఇలాంటి సమయంలో మన దేశంలోని మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.పోలీస్ అధికారి సంతోష్ గైక్వాడ్ ఈ ఘటనను ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

మహారాష్ట్ర బారామతి జిల్లాలోని ముధలే గ్రామా నివాసి 76 ఏళ్ల బామ్మ శంకుత గైక్వాడ్‌ కు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడగా కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఆబామ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో మే 10వ తేదీన ఓ ప్రైవేట్ వాహనంలో శంకుత గైక్వాడ్‌ ను బారామతి లోని ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమయ్యారు.

అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా ఆస్పత్రిలో బెడ్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. చేసేదేమీ లేక వారు కారులో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో శకుంతల పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కదలం కూడా ఆపేసింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయడానికి తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు.

తమ ఊరిలో అంత్యక్రియలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత అంతిమ యాత్రలో భాగంగా బామ్మను పాడెపై పడుకో పెడుతుండగా బామ్మ ఉలిక్కిపడి లేచి ఏడవటంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఊరి జనం ఒక్కసారిగా ఆశ్చర్యానికిలోనయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకున్న కుటుంబ సభ్యులు బామ్మను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బామ్మ బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

9 minutes ago

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

2 hours ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

2 hours ago

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

2 hours ago

గురువారం పూజతో అదృష్టం మారుతుందా? కాశీలో అరుదైన బృహస్పతి ఆలయం.. గురు దోషాలకు ప్రత్యేక పరిష్కారం!

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…

2 hours ago

రూ.10 కోట్ల స్కామ్ ఆరోపణలు.. మంగ్లీపై వివాదం మరింత ముదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…

3 hours ago