Categories: FeaturedMovie News

Mahesh Babu: ఒక్కడు టైములోనే సెట్ అవ్వాల్సిన కాంబో, ఆ స్టార్ డైరెక్టర్ కథకు మహేష్ ఫిదా అయ్యాడట..!

Mahesh Babu: సర్కారు వారి పాట సినిమా ఈరోజు విడుదలయి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. మహేష్ యాక్షన్ ప్లస్ కామెడీ కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటించింది. ఇక థమన్ బిజీఎం కొన్ని సన్నివేశాలకు బాగోలేదానే టాక్ వినిపిస్తోంది. ఇక మహేష్ బాబు తన తదుపరి చిత్రాలను త్రివిక్రమ్ తోనూ రాజమౌళి తోనూ ప్లాన్ చేసాడు. ఇక అభిమానులు కూడా రాజమౌళి తో మహేష్ ప్రాజెక్ట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు.

రాజమౌళితో సినిమా ఎపుడో సెట్ అవ్వాల్సి ఉన్నా అన్ని కుదిరి ఇపుడు ఓకే అయింది. పోకిరి సినిమా టైములోనే రాజమౌళితో కాంబినేషన్ సెట్ అవ్వాల్సి ఉన్నా ఇప్పటికి సెట్ అయింది. ఇక ఇపుడు ఇంకో క్రేజీ కాంబో గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. రాజమౌళితో సినిమాలాగే మరో స్టార్ డైరెక్టర్ వీ. సముద్ర దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయాల్సింది. ఇప్పటి తరం వారికి సముద్ర గారు తెలియక పోవచ్చు కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన సముద్ర సింహ రాశి, శివ రామ రాజు, ఎవడైతే నాకేంటి వంటి హిట్ సినిమాల దర్శకుడు.

20ఏళ్ల క్రితమే సముద్ర, మహేష్ కలయికలో సినిమా రావాల్సి ఉన్నా కుదరలేదు. ఒక్కడు సినిమా సమయంలోనే మహేష్ కి కథ వినిపించి ఓకే చేయించుకున్నాడు సముద్ర. సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఇక సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు అలా ఈ సూపర్ కాంబో ఆగిపోయింది ఇప్పటికి ఎపుడైనా మహేష్ ఎదురుపడితే ఆ కథా ఇంకా ఉందా లేక ఎవరికైనా ఇచ్చేసారా అని సముద్ర ను అడుగుతారట ఈ విషయం ఇటీవలి ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా సముద్ర గారే తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago