Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన ఏదైనా ఒక సినిమా విడుదల అయింది అంటే ఆ సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు..
ఈ క్రమంలోనే నిహారిక మొదటిసారి నిర్మాతగా మారి నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకొని కేవలం మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తుంది. ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.
కంగ్రాట్స్ నిహారిక..
ఈ సందర్భంగా మహేష్ బాబు సైతం సోషల్ మీడియా వేదికగా నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కంగ్రాట్స్ నిహారిక.. కమిటీ కుర్రోళ్ళు సినిమాకు సంబంధించి మంచి విషయాలను విన్నాను. తొలి చిత్రంతో నిర్మాతగా సక్సెస్‌గా సాధించిన నిహారిక కొణిదెలకు అభినందనలు. సినిమాలో సక్సెస్‌లో భాగమైన చిత్ర యూనిట్‌కు అభినందనలు. త్వరలోనే సినిమా చూస్తా అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…